Director Nag Ashwin Movie With Rajinikanth: నాగ్ అశ్విన్... ఈ పేరు వింటే మనకు 'కల్కి 2898AD' వంటి విజువల్ అవండర్ గుర్తొస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఓ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్‌తో సిల్వర్ స్క్రీన్‌పై మరో ప్రపంచాన్నే ఆవిష్కరించారు. ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడెప్పుడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే దానిపై కచ్చితమైన ఆన్సర్ చెప్పలేనని రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ చెప్పారు.
తలైవాతో మూవీ
ప్రభాస్‌తో 'కల్కి' సీక్వెల్ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉండడంతో నాగ్ అశ్విన్ మరో క్రేజీ ప్రాజెక్టును ట్రాక్ ఎక్కించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో మూవీని పూర్తి చేయాలని నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారట. గతంలోనే వీరిద్దరి కాంబోలో ఓ మూవీ ఉంటుందనే వార్తలు వచ్చాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి అశ్వినీదత్, రజినీకాంత్‌కు మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి పని చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నా కుదరడం లేదు. ఇప్పుడు నాగ్ అశ్విన్ మూవీతో ఆ డ్రీమ్ నెరవేరబోతోందని తెలుస్తోంది.
స్టోరీ ఏంటో?
డైరెక్టర్ నాగ్ అశ్విన్ తలైవాకు ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ వినిపించగా దానికి ఇంప్రెస్ అయిన రజినీకాంత్ ఓకే చెప్పేశారట. త్వరలోనే ఇది ట్రాక్ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీ తర్వాత ప్రభాస్‌తో 'కల్కి 2898AD' ట్రాక్ ఎక్కనున్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం.
Also Read: అఫీషియల్ అనౌన్స్‌మెంట్ - 'కల్కి 2898 AD' సీక్వెల్ నుంచి దీపికా పదుకోన్ అవుట్
వెయిటింగ్ ఫర్ కల్కి సీక్వెల్
గతేడాది జూన్ 27న వచ్చిన 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్‌పై ఓ సరికొత్త ప్రపంచాన్నే సృష్టించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ మూవీని నిర్మించగా... ప్రపంచవ్యాప్తగా దాదాపు రూ.1100 కోట్ల కలెక్షన్లు సాధించింది. అప్పటి నుంచి ఈ మూవీ సీక్వెల్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ ఏడాది చివర్లో షూటింగ్ స్టార్ట్ అవుతుందని పలుమార్లు చెప్పినా దానిపై క్లారిటీ లేదు.
రీసెంట్‌గా ఓ పాడ్ కాస్ట్‌లో నాగ్ అశ్విన్ 'కల్కి' సీక్వెల్‌పై రియాక్ట్ అయ్యారు. 'ఫస్ట్ పార్ట్‌ను మించి సెకండ్ పార్ట్ ఉంటుంది. యాక్టర్స్ అందరి డేడ్స్ కుదరాలి. ప్రస్తుతం అంతా బిజీగా ఉన్నారు. కొన్ని ప్రీ విజువలైజ్డ్ సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ చాలా పెద్దవి. వీటికి చాలా టైం పడుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా టైం తీసుకోవచ్చు.' అంటూ చెప్పారు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి డైరెక్షన్ 'ది రాజా సాబ్', హను రాఘవపూడి దర్శకత్వంలో 'ఫౌజీ' ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. దీని తర్వాత సందీప్ వంగాతో 'స్పిరిట్' మూవీలో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్టుల తర్వాతే 'కల్కి' సీక్వెల్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.