Deepika Padukone Remove From Kalki 2898AD Sequel: బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకోన్‌కు మరో షాక్ తగిలింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అవెయిటెడ్ మూవీ 'కల్కి 2898 AD' ఆమె భాగం కాదని చిత్ర నిర్మాణ సంస్థ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో మూవీ లవర్స్‌తో పాటు నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అసలు రీజన్ ఏంటంటే?
నిజానికి ప్రభాస్ 'స్పిరిట్' మూవీ విషయంలోనూ దీపికాకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు తాజాగా ప్రభాస్ 'కల్కి' సీక్వెల్‌లోనూ ఆమెను తప్పించారు. చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటించింది. 'కల్కి 2898AD సీక్వెల్‌లో దీపికా పదుకోన్ నటించడం లేదని అధికారికంగా ప్రకటిస్తున్నాం. చాలా విషయాల్లో పరిశీలించిన తర్వాత తమ భాగస్వామ్యం నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నాం.
పార్ట్ 1 సినిమా చేయడానికి చాలా దూరం ప్రయాణించినప్పటికీ, మా మధ్య భాగస్వామ్య సరిగా కుదరలేదు. కల్కి వంటి భారీ చిత్రానికి కమిట్మెంట్ చాలా అవసరం. దీపికా భవిష్యత్తులో మరెన్నో సినిమాలు చేయాలని మేము విషెష్ తెలియజేస్తున్నాం. గొప్ప టీంతో కల్కి 2 త్వరలోనే మీ ముందుకు వస్తుంది.' అంటూ రాసుకొచ్చింది.
Also Read: సందీప్ వంగాతో మహేష్ బాబు మూవీ? - 'SSMB29' తర్వాత క్రేజీ ప్రాజెక్ట్!
నెట్టించ చర్చ
స్టార్ హీరోయిన్‌ను బిగ్ ప్రాజెక్ట్ నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగుతోంది. 'కల్కి 2' టీం సడన్ షాక్ ఇచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీగా 2024లో వచ్చిన 'కల్కి 2898 AD' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇందులో సుమతి పాత్రలో దీపికా మెరిశారు. దీనికి సీక్వెల్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొంతకాలంగా దీపికా పేరు అటు సోషల్ మీడియా ఇటు ఇండస్ట్రీలో హైలైట్ అవుతుంది. ప్రభాస్ 'స్పిరిట్' విషయంలోనూ దీపికాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ మూవీ అనౌన్స్ చేసినప్పుడు కాంబినేషన్ అదిరిపోతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు.
అయితే, 8 గంటల వర్కింగ్ అవర్స్ కండీషన్, ఎక్కువ షూటింగ్ చేస్తే ఎక్స్‌ట్రా పేమెంట్స్ డిమాండ్స్‌తో ఆమెను డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పక్కన పెట్టినట్లు టాక్ వినిపించింది. ఆమె స్థానంలో 'యానిమల్' హీరోయిన్ త్రిప్తి దిమ్రిని సెలక్ట్ చేశారు. అప్పుడే 'కల్కి 2' నుంచి కూడా దీపికా అవుట్ అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇప్పుడు తాజాగా సీక్వెల్ నుంచి ఆమెను తప్పిస్తూ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక ఆ రోల్ ఎవరు చేస్తారు? కొత్త మూవీ టీం ఎలా ఉండబోతుంది? అనేది సస్పెన్స్‌గా మారింది.