Mahesh Babu Movie With Sandeep Reddy Vanga: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'SSMB29' మూవీతో బిజీగా ఉన్నారు. సాధారణంగా రాజమౌళి మూవీ అంటేనే ఓ స్పెషల్. జక్కన్న ఎవరైనా హీరోతో మూవీ చేస్తున్నారంటే తక్కువలో తక్కువ రెండేళ్లైనా వరుసగా డేట్స్ ఇవ్వాల్సిందే. హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ అడ్వెంచర్ 'SSMB29' 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మహేష్ తర్వాత మూవీ ఎవరితో చేస్తారనే దానిపై సస్పెన్స్ నెలకొంది. దీనిపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. 


సందీప్ వంగాతో


'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన డైరెక్టర్ సందీప్ రెండ్డి వంగాతో మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్టును చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించడానికి ఆసియన్ సునీల్, సందీప్ రెడ్డి వంగా... మహేష్ బాబును సంప్రదించినట్లు సమాచారం. సందీప్ ఓ సరికొత్త ఆలోచనతో మహేష్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేశారట. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ మహేష్‌కు వినిపించగా... ఆయన డెసిషన్ తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఏమీ కన్ఫర్మ్ కాలేదు. 


అయితే, మహేష్ బాబు క్రేజ్ దృష్ట్యా రాజమౌళి వంటి బిగ్ డైరెక్టర్‌తో మూవీ తర్వాత అంతే స్థాయిలో ప్రాజెక్టులు ఎంచుకుంటారని అందుకు సందీప్ వంగా సరైన వ్యక్తి అని అంతా భావిస్తున్నారు. రాజమౌళి మూవీ తర్వాత ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌తో మహేష్ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 


Also Read: ఎక్స్‌క్లూజివ్... బాలకృష్ణ 'అఖండ 2' రిలీజ్ డేట్ ఖరారు - థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?


'SSMB29' కోసం బిగ్గెస్ట్ సెట్


ప్రస్తుతం 'SSMB29' షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రీసెంట్‌గా కెన్యా నైరోబీలో షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ కాగా... హైదరాబాద్ 'రామోజీ ఫిల్మ్ సిటీ'లో ప్రస్తుతం కొత్త షెడ్యూల్ జరుగుతోంది. ఎలాంటి లీక్స్ లేకుండా మూవీ టీం ఫుల్ సెక్యూరిటీ మధ్య షూటింగ్ జరుపుతోంది. మూవీ కోసం కాశీ క్షేత్రానికి సంబంధించి సెట్ వేయనున్నారట. మహేష్‌తో పాటు ఇతర నటీనటులపై కీలక సీన్స్ తీయనున్నారు. అక్టోబర్ 10 వరకూ ఈ షూటింగ్ సాగనున్నట్లు తెలుస్తోంది.


ఇప్పటివరకూ సిల్వర్ స్క్రీన్‌పై ఎన్నడూ చూడని విధంగా ఓ విజువల్ వండర్‌ను జక్కన్న క్రియేట్ చేయనున్నారట. మహేష్ బర్త్ డే సందర్భంగా ప్రీ లుక్‌తో పాటు 'Globe Trotter' అంటూ హింట్ ఇచ్చారు రాజమౌళి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఓ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రాబోతోంది.


ఇక సందీప్ రెడ్డి వంగా విషయానికొస్తే... ప్రభాస్‌తో స్పిరిట్ మూవీ తెరకెక్కించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతుండగా... బీజీఎం పనులు కూడా 70 శాతం కంప్లీట్ అయినట్లు చెప్పారు సందీప్. త్వరలోనే ఈ మూవీ ట్రాక్‌ ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పూర్తైన తర్వాతే మహేష్ బాబుతో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.