Mal River Floods: బంగాల్‌లో దుర్గామాత విగ్రహ నిమజ్జనంలో విషాదం నెలకొంది. జల్‌పాయ్‌గురి జిల్లాలో విగ్రహ నిమజ్జనం చేస్తుండా వరదలు వచ్చాయి. దీంతో 8 మంది మృతి చెందారు.
ఇదీ జరిగింది
జల్‌పాయ్‌గురి జిల్లాలోని మాల్ నదిలో విగ్రహ నిమజ్జనం సందర్భంగా ఒకేసారి వరదలు వచ్చాయి. ఈ వరదల వల్ల ఎనిమిది మంది వరకు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. మరికొందరు కొట్టుకుపోయారు. బుధవారం రాత్రి 8.30 గంటలకు మాల్ నది ఒడ్డున ఈ ఘటన జరిగింది. విజయ దశమి సందర్భంగా విగ్రహ నిమజ్జనంలో పాల్గొనడానికి వందలాది మంది ప్రజలు వచ్చారు.
ప్రధాని సంతాపం
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ నేతలు మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. బంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి.. ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేయాలని కోరారు.
Also Read: Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!