Kerala School Bus Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థుల బస్సు.. ఆర్టీసీని ఢీ కొట్టిన ఘటనలో మొత్తం 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు.
ట్రిప్ కోసం
పాలక్కాడ్ జిల్లాలోని వడక్కంచెరిలో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బస్సును టూరిస్ట్ బస్సు ఢీ కొంది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించారు. 38 మంది గాయపడ్డారు. టూరిస్ట్ బస్సులో ఎర్నాకులం జిల్లాలోని బసేలియోస్ విద్యానికేతన్ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. టూరిస్ట్ బస్సు ఊటీకి వెళ్తోంది.
ఇలా జరిగింది
టూరిస్టు బస్సు వెనుక నుంచి కేఎస్‌ఆర్‌టీసీ బస్సును ఢీ కొనడంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. బసేలియోస్ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడిన టూరిస్ట్ బస్సు ఎర్నాకులం నుంచి ఊటీకి విహారయాత్ర కోసం వెళుతుంది. KSRTC బస్సు కోయంబత్తూరుకు వెళుతుంది.
మృతుల్లో ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు, కేఎస్‌ఆర్‌టీసీ బస్సులోని ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. మొత్తం 38 మంది ప్రయాణికులను ఆసుపత్రిలో చేర్చారు.
Also Read: Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!
Also Read: Amit Shah Jammu Kashmir Visit: 'మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్'- పాక్‌తో చర్చలపై అమిత్ షా