'నీ కంటే నా కూతురు వెయ్యి రేట్లు గొప్ప, తులసి మొక్క నా కూతురు అయితే కలుపు మొక్క నువ్వు. ఏంటి నువ్వు ఆత్మహత్యకి ప్రయత్నించావా? నువ్వు ఎప్పుడో చచ్చిపోయావ్ కదే బంగారం లాంటి భర్తని వదిలేసి బజారుణ పడినప్పుడే చచ్చిపోయావు, కోర్టులో నీ కన్నా కూతురే ఛీ కొట్టి వెళ్ళినప్పుడే చచ్చిపోయావ్. ఐశ్వర్యాన్ని వెతుక్కుంటూ రాలేదు నువ్వు ఐశ్వర్యాన్ని వదులుకుని వచ్చావ్. అదేంటో తెలుసా మెడలో తాళి కాలికి మెట్టెలు. నువ్వు బతికేది ఒక బతుకేనా. నిన్ను ఎవరైనా పేరంటానికి పిలుస్తారా? అసలు నువ్వు పిలిస్తే ఎవరైనా వస్తారా? తాళి కట్టిన భర్త, కన్న బిడ్డలని వదిలేసి ఏం బాగుకున్నావ్ చెప్పు' అని సులోచన మాళవికని దులిపి పడేస్తుంది.


అభి, ఖైలాష్ సులోచన నోరు మూయించేందుకు చూస్తే వాళ్ళని కూడా ఉతికేస్తుంది. ఇంకోసారి నా కూతురు జోలికి వస్తే మీ జాతకాలు తిరగబడతాయి అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఖైలాష్ ఎక్కువ చేస్తున్నావ్ అంటే నా జోలికి వస్తే చంపి పాతరేస్తా అని అరుస్తుంది. ఈరోజు నేను ఇచ్చిన వార్నింగ్ కి వాళ్ళు ఇక నా కూతురు జోలికి రారు అని సులోచన అనుకుంటూ రోడ్డు మీద నడుస్తుంది. అప్పుడే ఒక కారు వచ్చి సులోచనని గుద్దేసి వెళ్ళిపోతుంది. అప్పుడే అటుగా యష్ వస్తాడు. తనని చూసి షాక్ అవుతాడు. వెంటనే కారులో హస్పిటల్ కి తీసుకుని వెళతాడు. యష్ వేదకి ఫోన్ చేసి సులోచనకి యాక్సిడెంట్ అయిన విషయం చెప్తాడు. మావయ్య గారికి చెప్పకు టెన్షన్ పడతారు జాగ్రత్తగా రా అని చెప్తాడు.


Also Read: అనసూయ మాట విని షాకింగ్ నిర్ణయం తీసుకున్న సామ్రాట్- గాల్లో తేలిపోతున్న లాస్య


వేద బాగా ఏడుస్తూ హస్పిటల్ కి వస్తుంది. నేను ఉన్నా కదా నేను చూసుకుంటాను నువ్వు ఏడవకు ప్లీజ్ అని యష్ ధైర్యం చెప్పేందుకు చూస్తాడు. ఇంట్లో అందరూ కూడా హాస్పిటల్ కి వస్తారు. శర్మ కూడా హస్పిటల్ కి వచ్చి ఏమైంది మీరందరూ ఇక్కడ ఎందుకు ఉన్నారు ఎందుకు ఎదుస్తున్నారు ఏమైంది చెప్పమని టెన్షన్ గా అడుగుతాడు. మావయ్య మీరు నాకు ఒక ప్రామిస్ చెయ్యండి నేను చెప్పేది విని ధైర్యంగా ఉండాలి. విషయం ఏమిటంటే అత్తయ్యగారికి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పడంతో శర్మ షాకై కూలబడిపోతాడు. ఇప్పుడు నా సులోచన ఎలా ఉండి అల్లుడుగారు అని శర్మ ఏడుస్తూ ఉంటాడు.


మాలిని, రత్నం కూడా హాస్పిటల్ కి వస్తారు. వేద ఏమైంది ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావ్, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు ఏమి కాదులే అని మాలిని కూడా ధైర్యం చెప్పేందుకు చూస్తారు. మీ అమ్మ చేసిన పూజలు వెస్ట్ కావు, తను చాలా గట్టిది మీరు ఏడవకండని ధైర్యం చెప్తుంది మాలిని. అప్పుడే డాక్టర్ వస్తుంది. ఇప్పుడే ఆపరేషన్ అయ్యింది. 24 గంటల్లో ఆమె స్పృహలోకి రావాలి.. వస్తే కానీ ఏమి చెప్పలేము అని డాక్టర్ యష్ వాళ్ళతో చెప్తుంది. అది విని వేద షాక్ అవుతుంది.


Also Read: బయటపడిన ఆదిత్య అబద్ధం, షాకైన సత్య- మాధవ్ కుట్ర వినేసిన రుక్మిణి


తరువాయి భాగంలో..


ఏయ్ సులోచన నేను వచ్చినాక కూడా లేవకుండా చక్కగా పడుకున్నావ్ ఏంటి లేవవా ఎంత పొగరే నీకు. నాకు భరతనాట్యం రాదు అన్నావ్ కదా ఇప్పుడు ఇక్కడ చేస్తాను అని మాలిని ఏడుస్తూ డాన్స్ చేస్తుంది. చూడు నీ కోసం డాన్స్ చేస్తున్నా అనేసరికి సులోచనలో కదలిక వస్తుంది. అమ్మ చెయ్యి కదిలింది అత్తయ్య అని వేద ఏడుస్తూ చెప్తుంది.