నువ్వు ఇలా నా వెంట వచ్చావ్ అని తెలిస్తే సత్య ఎంత పరేషన్ అవుతుందని రుక్మిణి తన బాధని ఆదిత్యతో పంచుకుంటుంది. ఆ అమ్మని చూసుకోవడానికి నేను ఉన్నా కదా నువ్వు ఇంటికి వెళ్ళు అని రుక్మిణి అంటుంది. నువ్వు కూడా ఇలా మాట్లాడతావ్ ఏంటి రుక్మిణి అని ఆదిత్య చాలా బాధగా అంటాడు. దేవమ్మ గురించే కదా బిడ్డని నీ దగ్గరకి పంపించాలని చూసిన ప్రతిసారీ ఏదో ఒకటి జరుగుతుంది కానీ బిడ్డని మాత్రం నీకు ఇస్తాను అని అంటుంది. ఆ మాటలు విన్న మాధవ్ దొరికావ్ రా ఆదిత్య ఎక్కడ కొట్టాలో అర్థం అయ్యిందని మాధవ్ అనుకుంటాడు. అటు ఇంట్లో సత్య రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడకి వెళ్లారు అని అనుకుంటూ ఉండగా మాధవ్ సత్యకి మెసేజ్ పంపిస్తాడు. రుక్మిణి, ఆదిత్య కలిసి ఉన్న ఫోటో చూసి సత్య షాక్ అవుతుంది.


అంటే క్యాంప్ కి వెళ్తున్నా అని మాతో ఆదిత్య అబద్ధం చెప్పాడా, అక్కతో కలిసి బయటికి వెళ్లాడా, నాతో ట్రిప్ కి రాను అన్నది ఇందుకా ఇదేనా ఆదిత్య ఇంపార్టెంట్ వర్క్ అని సత్య బాధపడుతుంది. ప్రకృతి వైద్యశాలలో పని చేస్తున్న ఒక నర్స్ ని మాధవ్ పక్కకి పిలిచి మాట్లాడతాడు. ఇంకో మనిషికి తెలియకుండా నువ్వు నాకు సాయం చెయ్యాలి. నేను చెప్పినట్టే మా అమ్మకి వైద్యం చెయ్యాలి అని ఆమెకి డబ్బు ఆశ చూపిస్తాడు. నర్స్ ఆ డబ్బులు తీసుకుని మాధవ్ చెప్పినట్టు చెయ్యడానికి రెడీ అవుతుంది. జానకి సైగల ద్వారా రాధకి ఏదో చెప్పాలని చూస్తుంది కానీ ఎవరికి అర్థం కాదు. ఎందుకు మీరు భయపడుతున్నారు మీకు ఏమి కాదని ఆదిత్య చెప్తాడు. నాకు నా బాధ గురించి కాదు రాధ గురించి అది మీకు ఎలా చెప్పాలి అని జానకమ్మ మనసులోని కుమిలిపోతుంది.


Also Read: 'అసలు నువ్వు ఎందుకు బతికావ్ చావొచ్చు కదా' మాళవికతో అన్న అభి- గుండె పగిలేలా ఏడ్చిన వేద


దేన్ని చూసి భయపడుతున్నావ్ అని రామూర్తి అడిగేసరికి జానకి మాధవ్ వైపు చూస్తుంది. రాత్రి వేళ మాధవ్ జానకి దగ్గరకి వస్తాడు. అప్పుడే రాధ కూడా అటుగా వస్తుంది. సైగలు బాగానే చేస్తున్నావ్ నీ సైగలకి అర్థం ఏంటో ఆ బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే ఆ బాధకి కారణం నేనే, కానీ మిగిలిన వాళ్ళకి అది అర్థం కాదు కదా. నీకేమో గబగబా మాట్లాడేయాలి నా గురించి నిజం చెప్పాలని ఆశ. నువ్వు అలా మాట్లాడేస్తే నా పరిస్థితి ఏమైపోవాలి. నువ్వు ఇలా ఉన్నంత వరకి నేను ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిన్ను చూసుకోడానికి రాధ ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే రాధ నిన్ను ఇలా వదిలేసి వెళ్లలేదు’ అని మాధవ్ అనడం విని రాధ షాక్ అవుతుంది.


‘నువ్వు ఈ మంచం మీద వీల్ చైర్ లో ఉన్నంత వరకి రాధ నిన్ను వదిలి వెళ్లలేదు. నాకు కావలసింది అదే కదా. అందుకే నువ్వు మామూలు మనిషి అయ్యే ఒక్క చిన్న అవకాశం నేను ఇవ్వను. నాకు కావలసింది రాధ ఇల్లు వదిలి వెళ్లకపోవడం. అందుకు నువ్వు తప్ప వేరే దారి లేదమ్మా. నిన్ను ఇలా బాధపెడుతున్నందుకు చాలా బాధగా ఉంది. తప్పని తెలిసినా తప్పడం లేదు. రాధ కోసం నీకు వైద్యం జరగనివ్వను. నువ్వు ఎప్పటికీ ఇలా ఉండాల్సిందే. మందుల్ని మార్చేశాను, ఒకవేళ ఆ మందులు వాడటం వల్ల నీకు ఏదైనా జరగరానిది జరిగితే ఆ నేరం వాడి మీదకి వెళ్ళిపోతుంది’ అనేసరికి రాధ షాక్ అయ్యి చేతిలోని గ్లాస్ కిందపడేస్తుంది. ఆ సౌండ్ విని మాధవ్ వెనక్కి తిరిగేలోపు రాధ అక్కడి నుంచి వెళ్ళిపోవడం మాధవ్ చూస్తాడు. వెంటనే మాధవ్ సత్యకి ఫోన్ చేసి నీతో మాట్లాడాలి లొకేషన్ పంపిస్తున్నా అక్కడికి వచ్చేయ్ అని చెప్తాడు.


Also Read: ఆదిత్య కోరిక- వేద గుండె ముక్కలు, సులోచనకి యాక్సిడెంట్ చేయించిన మాళవిక