‘చూస్తూ చూస్తూ తులసిని జనాల వెర్రి తనానికి బలి చేయలేను. ఈరోజు రాత్రపార్టీ అయ్యేలోపు నేను చెప్పింన దాని గురించి నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఆ తర్వాత నా నిర్ణయం నేను తీసుకుంటాను. నువ్వు మా ఇంటికి రాకూడదు. మా ఇంట్లో ఏం జరిగినా తొంగి చూడటానికి కూడా వీల్లేదు. నేను తులసి దృష్టిలో చెడ్డదాన్ని అయినా పరవాలేదు కానీ తులసికి మాత్రం చెడు జరగనివ్వను. కంచెలా కాపాడుకుంటాను’ అని అనసూయ కోపంగా చెప్తుంది. పెద్దాయన వచ్చి ఏమైంది ఎందుకు ఆవిడ అంత కోపంగా ఉందని అడుగుతాడు. పార్టీ అయిన తర్వాత మాట్లాడుకుందామని సామ్రాట్ అంటాడు.


పార్టీకి వచ్చిన ఒక వ్యక్తి నందుని అవమానకరంగా మాట్లాడతాడు. పెళ్ళాం చేతి కింద పని చేయడం కంటే అడుక్కోవడం మేలు అని అనేసరికి నందు ఆవేశపడతాడు. కానీ వద్దని లాస్య వారిస్తుంది. హనీ సామ్రాట్ కొన్న డ్రెస్ వేసుకుని వస్తుంది. తనని చూసి సామ్రాట్ మురిసిపోతాడు. నేను తీసుకొచ్చిన డ్రెస్ నచ్చలేదా నేను తీసుకురావడం తప్పా అని తులసి అడుగుతుంది. కొన్ని నిజాలు తెలుసుకోవడం కంటే తెలుసుకోకుండా ఉండటమే మంచిదని సామ్రాట్ అంటాడు. కేక్ కట్ చేసే ముందు తులసి ఆంటీ కి ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా అని హనీ అంటుంది. తులసి కోసం హనీ పాట పాడుతూ సంతోషంగా ఉంటుంది.  


Also Read: బయటపడిన ఆదిత్య అబద్ధం, షాకైన సత్య- మాధవ్ కుట్ర వినేసిన రుక్మిణి


కేక్ కట్ చెయ్యడానికి హనీ తులసిని కూడా పక్కన వచ్చి నిలబడమంటుంది. హనీ బర్త్ డే సందర్భంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నా అది ఇప్పుడు చెప్తానని నందుని స్టేజ్ మీదకి పిలుస్తాడు. ఒక చిన్న పొరపాటు వల్ల ఈరోజు మా కంపెనీ రూ.10 కోట్లు నష్టపోయేది. అది జరగకుండా నందు ఆపాడని సామ్రాట్ అందరి ముందు చెప్తాడు. కేవలం 10 కోట్ల విషయం అందరి ముందు చెప్పాల్సిన అవసరం ఏముంది రాను రాను మా వాడికి బుర్ర మోకాలిలో ఉంటుందని పెద్దాయన మనసులో తిట్టుకుంటాడు. అందుకె అతని లాయల్టీకి మెచ్చి కంపెనీ తరపున ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నా.. తులసి గారి ప్లేస్ లో జనరల్ మేనేజర్ గా అపాయింట్ చేస్తున్నా అని సామ్రాట్ ప్రకటిస్తాడు. అది విని నందు, లాస్య, అభి చాలా సంతోషిస్తారు.


అనసూయ కూడా నవ్వుతూ ముఖం పెడుతుంది. ఏంట్రా ఇది మేనేజర్ సీట్లో కూర్చోబెట్టి రెండు రోజులు కూడా కాలేదు కదా అప్పుడే తీసెయ్యడం ఏంటి అని పరంధామయ్య ప్రేమ్ తో అంటాడు. నాకు అదే అర్థం కావడం లేదని ప్రేమ్ అంటే వెళ్ళి అడుగుదామని శ్రుతి అంటుంది. అమ్మకి చెప్పకుండా అడిగితే బాగోడు, అయినా ఆఫీసు విషయాలు పార్టీలో డిస్కస్ చేయడం ఏంటని దివ్య కూడా అంటుంది. ఇంత జరుగుతున్న సైలెంట్ గా ఉన్నావ్ ఏంటి నానమ్మ అని ప్రేమ్ అనసూయని అడుగుతాడు. తను కోరుకున్నది జరుగుతుంటే ఏం మాట్లాడుతుందని పరంధామయ్య అంటాడు. మొహమాటం పక్కన పెట్టి కంపెనీకి తగిన నిర్ణయం తీసుకునే వాడే నిజమైన బాస్. మీరు నిజమైన బాస్ అనిపించుకున్నారని సామ్రాట్ ని తులసి పొగుడుతుంది.


Also Read: 'అసలు నువ్వు ఎందుకు బతికావ్ చావొచ్చు కదా' మాళవికతో అన్న అభి- గుండె పగిలేలా ఏడ్చిన వేద