ABP  WhatsApp

CM Mamata Steers Boat: బోటు నడిపిన సీఎం మమతా బెనర్జీ- వైరల్ వీడియో!

ABP Desam Updated at: 01 Dec 2022 12:27 PM (IST)
Edited By: Murali Krishna

CM Mamata Steers Boat: బంగాల్ సీఎం మమతా బెనర్జీ బోటు నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(Image Source: Twitter)

NEXT PREV

CM Mamata Steers Boat: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉత్తర 24 పరగణాల జిల్లాలో బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా మమతా.. ఓ గ్రామానికి వెళ్లేటప్పుడు బోటు నడిపారు. ఈ వీడియో వైరల్ అవుతోంది.


పర్యటన


మూడు రోజుల పర్యటనలో భాగంగా ఉత్తర 24 పరగణాల జిల్లాలో పర్యటిస్తున్న మమతా బెనర్జీ.. కాపుకుర్, హస్నాబాద్ స్థానికులకు చలి దుస్తులు, చీరలు పంపిణీ చేశారు. తాగు నీటి సమస్య గురించి స్థానికులు చెప్పడంతో తక్షణమే అన్ని ఇళ్లకు నీటి సరఫరా చేయించాలని అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ గ్రామానికి వెళ్లేటప్పుడు మమతా బోటు డ్రైవ్ చేశారు.







మీ నీటి సమస్య గురించి నాకు తెలిసింది, మేము దానిపై పని చేస్తున్నాం. 2024 లోపు ప్రతి ఇంటికి కుళాయి నీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా మేజిస్ట్రేట్‌, మిగతా శాఖలతో కలిసి వీలైనంతా త్వరగా సమస్య పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాము.                                          - మమతా బెనర్జీ, బంగాల్ సీఎం


ఈ పర్యటనకు సంబందించిన 2 వీడియోలను తృణమూల్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేసింది. ఒక వీడియోలో పడవ నడుపుతున్న దృశ్యాలు, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించి చాక్లెట్స్, బొమ్మలు పంపిణీ చేసిన దృశ్యాలు ఉన్నాయి. మరో దానిలో ఒక స్థానిక మహిళతో కలిసి దీదీ చేనేత పని చేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. బుధవారం మధ్యాహ్నం మమతా బెనర్జీ ఓ స్థానికురాలి ఇంట్లో అన్నం, చేపల కూరతో భోజనం చేశారు.






Also Read: India's Jobless Rate: నిరుద్యోగ భారతం- భారీగా పెరిగిన అన్‌ ఎంప్లాయ్‌మెంట్‌ రేటు!

Published at: 01 Dec 2022 12:27 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.