Banks Cannot Coerce Defaulters: అప్పులు తీసుకుని తీర్చలేకపోయిన వారి పట్ల ఇప్పుడు బ్యాంకులు కూడా కాబూలీవాలాల తరహాలో ఉంటున్నాయి. డీఫాల్టర్ల పరువు తీసేందుకు ముందూ వెనుకాడటం లేదు. ఇలాంటి వారికి కేరళ హైకోర్టు షాకిచ్చే తీర్పు చెప్పింది. లోన్ డిఫాల్టర్లు అయినా సరే వారి పరువు తీసే హక్కు బ్యాంకులకు లేదని స్పష్టం చేసింది.                                          


Also Read:  మరింత బలహీనపడిన రూపాయి - నాటి జూహీచావ్లా "అండర్‌వేర్ జారిపోయే" కామెంట్స్ మరోసారి వైరల్


కేరళకు చెందిన కొంత మంది వ్యక్తులు కోఆపరేటివ్ బ్యాంకు వద్ద లోన్ తీసుకున్నారు. వారు కట్టలేకపోయారు. దీంతో వారి బొమ్మలతో కోఆపరేటివ్ బ్యాంకు ఫ్లెక్సీలు వేసింది. వీరు బ్యాంక్ వద్ద డబ్బులు తీసుకున కట్టలేదని ఆ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ఇలా తమ ఫోటోలతో ఫ్లెక్సీలు వేసి తమ పరువు తీస్తున్నారని బ్యాంకుపై చర్యలు తీసుకోవాలని వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన కేరళ హైకోర్టు బ్యాంకు చర్చలను తప్పు పట్టింది. 



రుణాలు తీసుకుని కట్టలేకపోయినంత మాత్రాన వారి ప్రైవసీకి, గౌరవానికి భంగం కలిగించడం మంచిదని కాదని స్పష్టం చేసింది. అప్పులు ఎగ్గొట్టినంత మాత్రాన వారు పరువు పోగొట్టుకుని బతకాల్సిన అవసరం లేదని వారికీ గౌరవంగా బతికే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆర్టికల్ 21ని కోర్టు ప్రస్తావించింది.                                                                               


Also Read:  వీడెవడండి బాబూ -యూట్యూబ్ వీడియోల కోసం 120 కోట్లు పెట్టి కాలనీ కట్టేశాడు!


ఈ తీర్పు అన్ని రకాల బ్యాంక్ డిఫాల్టర్లకు వర్తిస్తుంది. అంటే క్రెడిట్ కార్డు డి ఫాల్టర్లకు కూడా వర్తిస్తుంది. నిజానికి క్రెడిట్ కార్డులను ఉపయోగించుకుని చెల్లించలేకపోయేవారు ఎక్కువగా ఉంటారు. వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసుకోవడానికి రికవరీ ఏజెంట్లను బ్యాంకులు నియమించుకుంటాయి. వారు దురుసుగా ప్రవర్తిస్తారన్న ఆరోపమలు తరచూ వస్తూనే ఉంటాయి. అయితే బ్యాంకు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు కానీ.. ఇలా పురువు తీసేలా.. ఫ్లెక్సీలు వేయడం.టాం టాం చేయడం మాత్రం తప్పు అని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పుడు డిఫాల్టర్లు కాస్త ధైర్యంగా  ఉండవచ్చు.