ఏఐఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వాహనంపై కాల్పులు జరిగాయి. ఛజర్సీ టోల్ ప్లాజా వద్ద ఆయన కారుపై 3-4 రౌండ్లు బుల్లెట్ల కాల్పులు జరిపారు.
ఉత్తర్‌ప్రదేశ్ మేరట్‌లో ఓ ఎన్నికల ప్రచారంలో పాల్గొని దిల్లీ వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది.
దర్యాప్తునకు విజ్ఞప్తి..
కాల్పుల ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఓవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ దర్యాప్తు చేపట్టాల్సిన బాధ్యత మోదీ, యూపీ ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ విషయంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలుస్తానన్నారు. కాల్పులు జరిపిన వారిలో ఒకరిని అరెస్ట్ చేశామని పోలీసులు తనకు చెప్పినట్లు ఓవైసీ పేర్కొన్నారు. అతని నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
Also Read: Galwan Valley Clash: 'చైనా అబద్ధం చెప్పింది.. గల్వాన్ ఘర్షణలో వారి సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ'
Also Read: UP Election 2022: యోగిపై ఈసీకి సమాజ్‌వాదీ ఫిర్యాదు.. సీఎం భాషపై అభ్యంతరం