కేంద్ర ఎన్నికల సంఘానికి సమాజ్‌వాదీ పార్టీ లేఖ రాసింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో మాట్లాడుతోన్న భాషపై ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా సీఎం మాట్లాడేలా ఆదేశాలు ఇవ్వాలని లేఖలో పేర్కొంది.
యోగి వ్యాఖ్యలు..
యూపీలో విస్తృతంగా ప్రచారం చేస్తోన్న యోగి ఆదిత్యనాథ్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మార్చి 10 (ఎన్నికల ఫలితాలు) తర్వాత సంఘ విద్రోహ శక్తులు, మాఫియాలను బుల్డోజర్‌తో తొక్కిస్తామని యోగి అన్నారు.
అంతేకాకుండా ఆర్‌ఎల్‌డీ అధినేత జయంత్ చౌదరీ, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్.. యూపీలో అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
దూకుడు పెంచిన భాజపా..
యూపీ ఎన్నికలు దగ్గర పడుతోన్న వేళ భాజపా ప్రచారంలో దూకుడు పెంచింది. యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. యూపీలో విస్త్రృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సమాజ్‌వాదీ పార్టీయే లక్ష్యంగా భాజపా విమర్శల దాడి చేస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులను గూండాలు, మాఫియాలుగా భాజపా చిత్రీకరిస్తూ ఆరోపణలు చేస్తోంది.
Also Read: Galwan Valley Clash: 'చైనా అబద్ధం చెప్పింది.. గల్వాన్ ఘర్షణలో వారి సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ'
Also Read: India Corona Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు.. తాజాగా 1,72,433 మందికి కరోనా