UP Election 2022: 'మాఫియా' చుట్టూ యూపీ రాజకీయం.. నిన్న మోదీ, నేడు అమిత్ షా.. ఒకటే కౌంటర్!

ABP Desam Updated at: 02 Feb 2022 08:08 PM (IST)
Edited By: Murali Krishna

మాయావతి, అఖిలేశ్ యాదవ్ పాలనలో యూపీ మాఫియా అడ్డాగా ఉండేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు.

మాఫియా చుట్టూ యూపీ రాజకీయం

NEXT PREV

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతోన్న వేళ రాజకీయ పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటివరకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాత్రమే.. సమాజ్‌వాదీ నేతలను మాఫియా పేరుతో విమర్శించారు. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఈ 'మాఫియా' పేరుతోనే విమర్శలు చేస్తున్నారు. యూపీ రాజకీయం మొత్తం ఇప్పుడు మాఫియా చుట్టూనే తిరుగుతోంది.


తాజాగా యూపీ ఎన్నికల ప్రచారం చేస్తోన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మాయావతి, అఖిలేశ్ యాదవ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వారిద్దరి పాలనలో యూపీలో మాఫియా అడ్డాగా ఉండేదన్నారు. యూపీలోని సహస్వాన్‌లో జరిగిన భారీ బహిరంగ ర్యాలీలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.



ప్రస్తుతం మాఫియా మూడు చోట్ల మాత్రమే ఉంది. ఒకటి యూపీ అవతల, రెండోది బుదౌన్ జైలులో.. మూడోది ఎస్పీ అభ్యర్థి రూపంలో. గత మూడేళ్లలో మీకు యూపీలో మాఫియా కనిపించిందా? అఖిలేశ్ యాదవ్‌.. రెడ్ లైట్, గ్రీన్ లైట్‌తో ఆడుకోవటానికే అధికారంలోకి రావాలనుకుంటున్నారు. అభివృద్ధికి రెడ్ లైట్, మాఫియాలకు గ్రీన్ లైట్ చూపిస్తారు.                                                           -  అమిత్ షా, కేంద్ర హోంమంత్రి


వారంతా గూండాలు?

 

ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఇటీవల జరిగిన యూపీ వర్చువల్ ర్యాలీలో సమాజ్‌వాదీ పార్టీపై విమర్శల దాడి చేశారు. 

 



2017కు ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతి, భద్రతలకు తీవ్ర విఘాతం కలిగేది. మేరట్, బులంద్‌షెహర్ వంటి జిల్లాల్లో అమ్మాయిలు బయటకు రావాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు వారు ఎంతో ధైర్యంగా బయటకు వస్తున్నారు. ఇంతకుముందున్న ప్రభుత్వాల పాలనలో.. లూఠీలు చేసేవారు, గూండాలదే రాజ్యం. వాళ్ల మాటలే ప్రభుత్వ ఆదేశాలుగా భావించేవారు. ఓవైపు మేం ఉత్తర్‌ప్రదేశ్‌లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కొంతమంది ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతీకారమే వారి ధ్యేయం.                                             "
-ప్రధాని నరేంద్ర మోదీ





7 విడతల్లో..


403 అసెంబ్లీ స్థానాలున్న యూపీలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఎన్నికలు మొదలుకానున్నాయి. మార్చి 10న ఫలితాలు వెల్లడిస్తారు.


Also Read: TMC in Lok Sabha Polls: మోదీని గద్దె దించేందుకు దీదీ ప్లాన్.. 2024 ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ!


Also Read: UP Election 2022: యూపీ మాజీ మంత్రులు మౌర్య, అభిషేక్ మిశ్రాకు టికెట్లు ఇచ్చిన ఎస్పీ


Published at: 02 Feb 2022 08:08 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.