ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే తమ అభ్యర్థుల మరో జాబితాను సమాజ్‌వాదీ పార్టీ ప్రకటించింది. ఇందులో యూపీ మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, అభిషేక్ మిశ్రాను పేర్లు ఉన్నాయి.
కుషీనగర్‌లోని ఫాజిల్‌నగర్ సీటును మౌర్యకు కేటాయించారు అఖిలేశ్ యాదవ్. మరోవైపు అభిషేక్ మిశ్రాను లఖ్‌నవూలోని సరోజినీ నగర్ నుంచి బరిలోకి దింపారు. మరో అభ్యర్థి పల్లవి పటేల్‌ను కౌశాంబి స్థానం నుంచి పోటీకి దింపారు. గత నెలలో స్వామి ప్రసాద్ మౌర్య.. భాజపా నుంచి బయటకు వచ్చారు.
స్వామి ప్రసాద్ మౌర్య భాజపాకు రాజీనామా చేసిన తర్వాత 3 రోజుల్లో మరో 8 మంది ఎమ్మెల్యేలు భాజపాను వీడారు. అంటే మొత్తం 9 మంది రాజీనామా చేసినట్లైంది. ఇందులో ముగ్గురు మంత్రులు ఉన్నారు.
దళితులను విస్మరించారు..
స్వామి ప్రసాద్ మౌర్య ఓబీసీ వర్గానికి చెందిన బలమైన నాయకుడు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బహుజన్ సమాజ్ పార్టీ నుంచి 2016లో ఆయన భాజపాలో చేరారు. అప్పటి నుంచి అఖిలేశ్ యాదవ్ పార్టీకి ఓబీసీ ఓటర్లను దూరం చేసే ప్రణాళికల్లో ముఖ్యపాత్ర పోషించారు మౌర్య.
తాను రాజీనామా చేయడానికి దళితులపై భాజపా చిన్నచూపు వైఖరే కారణమని మౌర్య రాజీనామా పత్రంలో పేర్కొన్నారు.
Also Read: India Corona Cases: దేశంలో నిన్న ఒక్కరోజులో 1,733 కరోనా మరణాలు.. కొత్తగా లక్షన్నర మందికి కొవిడ్
Also Read: PM e-Vidya: వన్ క్లాస్- వన్ టీవీ ఛానెల్.. హైక్వాలిటీ కంటెంట్‌తో 200 టీవీ ఛానెళ్లు.. బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపు ఇదీ..