దేశంలో కరోనా ఉద్ధృతంగా ఉండటంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో రోడ్‌షోలు, బైక్, వాహన ర్యాలీలు, ఊరేగింపులు, పాదయాత్రలపై ఉన్న నిషేధాన్ని ఫిబ్రవరి 11 వరకు పొడిగించింది. అయితే ప్రచారానికి వీలు కల్పిస్తూ కొన్ని ఆంక్షలను సడలించింది.






వీటికి ఓకే..



  • బహిరంగ సభలు, ఇండోర్ సమావేశాలు, ఇంటింటి ప్రచారంలో రాజకీయ పార్టీలకు ఊరట.

  • బహిరంగ సభల్లో 500 మందికి మాత్రమే ఉన్న పరిమితిలో సడలింపు.

  • గరిష్ఠంగా 1000 మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి.

  • ఇండోర్​ ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఉన్న 300 మంది నిబంధన సడలించింది. గరిష్ఠంగా 500 మందికి అనుమతి.

  • ఇంటింటి ప్రచారంలో జనాల పరిమితిని పెంపు. ఇంటింటి ప్రచారంలో 10 మందికే ఉన్న అనుమతిని 20కి పెంపు.


ఐదు రాష్ట్రాల్లోని ఓటర్ల ముఖచిత్రం



  • మొత్తం అర్హులైన ఓటర్లు- 18 కోట్లు

  • మహిళా ఓటర్లు- 8.5 కోట్లు

  • కొత్త ఓటర్లు- 24.9 లక్షలు

  • కొత్తగా నమోదైన మహిళా ఓటర్లు- 11.4 లక్షలు

  • మొత్తం పోలింగ్ స్టేషన్లు- 2,15,368


కరోనా జాగ్రత్తలతో..


కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని పోలింగ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రచించినట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది అంతా రెండు టీకాలు తీసుకున్నవారే ఉంటారని స్పష్టం చేసింది. ఎన్నికల సిబ్బందిని ఫ్రంట్ లైన్ వర్కర్లలా పరిగణించి బూస్టర్/ప్రికాషన్ డోసు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోని లబ్ధిదారులకూ వేగంగా టీకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు స్పష్టం చేసింది.