Just In





India Corona Cases: భారత్‌లో మళ్లీ పెరిగిన పాజిటివ్ కేసులు.. తాజాగా 1,72,433 మందికి కరోనా
India Corona Cases: నిన్నటితో పోల్చితే 6.8 శాతం పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,72,433 (1 లక్షా 72 వేల 433) మంది కరోనా బారిన పడ్డారు.

India Corona Cases: భారత్‌లో కరోనా వ్యాప్తి తగ్గినట్లు కనిపిస్తున్నా కేసులు నేడు పెరిగాయి. నిన్నటితో పోల్చితే 6.8 శాతం పాజిటివ్ కేసులు అధికంగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,72,433 (1 లక్షా 72 వేల 433) మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో నిన్న ఒక్కరోజులో కరోనాతో పోరాడుతూ మరో వెయ్యి మంది మరణించారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా ప్రకటనలో తెలిపింది.
బుధవారం నాడు దేశ వ్యాప్తంగా కరోనాతో పోరాడుతూ 1,008 మంది చనిపోయారు. దీంతో భారత్‌లో కరోనా మరణాల సంఖ్య 4,98,983కు చేరింది. నిన్న ఒక్కరోజులో 2,59,107 మంది కరోనాను జయించి ఆరోగ్యంగా డిశ్ఛార్జ్ అయ్యారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,33,921కు తగ్గింది. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు మళ్లీ 10 దాటింది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.99 అయింది.
భారత్‌లో కొవిడ్ డోసుల పంపిణీ 167.87 కోట్ల మైలురాయికి చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతా వద్ద ఇంకా 13 కోట్ల మేర వ్యాక్సిన్ డోసుల వరకు నిల్వ ఉన్నాయని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా నేటి ఉదయం వరకు 38.44 కోట్ల మంది కరోనా బాధితులుగా మారారు. 56.9 లక్షల మంది మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు. వైరస్ వ్యాప్తిని నిర్మూలించేందుకు 101 కోట్ల డోసుల వ్యాక్సిన్ల పంపిణీ జరిగినట్లు ప్రముఖ జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తాజాగా తెలిపింది.
Also Read: Chittoor Crime: సిగరెట్ తాగేందుకు స్నేహితుడ్ని బయటకు పిలిచి ఏం చేశారంటే..!
Also Read: Schools Reopen: స్కూల్స్ రీఓపెన్.. భౌతిక తరగతుల నిర్వహణకు పేరెంట్స్ పర్మిషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం