2022 సంవత్సరానికియూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎవరు అర్హులు, ఎలా అప్లై చేయాలి, ఏజ్ లిమిటి ఏంటన్న వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది.
ఈ సారి 861 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది యూపీఎస్సీ. UPSC.GOV.IN ద్వారా అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 22 సాయంత్రం ఆరుగంటల వరకు అప్లై చేసుకునే చాన్స్ ఉంది.
ఈ నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీ కోసం జూన్ ఐదున ప్రిలిమ్స్ నిర్వహించనుంది యూపీఎస్సీ. అందులో అర్హత సాధించిన వాళ్లంతా తర్వాత జరిగే మెయిన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది.
భారతీయ పౌరులైనవాళ్లు ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ ఉద్యోగాలకు అర్హులవుతారు. శరనార్థులు ఎవరైనా ఉంటే వాళ్లు మిగతా వాటికి అర్హులు. ఎవరు ఎలాంటి పోస్టులకు అర్హులో వెబ్‌సైట్‌లో క్లియర్‌గా వివరించింది యూపీఎస్సీ.
అభ్యర్థుల వయసు కచ్చితంగా 21 ఏళ్లు దాటి 32 ఏళ్ల లోపు ఉన్న వాళ్లే ఈ పరీక్ష రాయడానికి అర్హత ఉన్నట్టు. రిజర్వేషన్ వర్తించే వాళ్లకు కాస్త సడలింపు ఇచ్చింది యూపీఎస్సీ.
యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొందిన వాళ్లంతా సివిల్స్ పరీక్ష రాయొచ్చు.
ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లు ఉంటాయి. ఇందులో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. మొత్తం నాలుగు వందల మార్కులకు ప్రిలిమ్స్ ఉంటుంది. రెండో పేపర్ మొత్తం జనరల్ స్టడీస్‌పై ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రిలిమ్స్‌లో 33శాతం మార్కులు రావాలి.
మూడు తప్పుడు జవాబులకు ఒక మార్కు కోతపడుతుంది. అంటే నెగటివ్ మార్క్ విధానం ఉంది. పేపర్1లో ప్రధానంగా ఏడు సబ్జెక్టులను తీసుకొని ప్రశ్నలను ఫ్రేమ్ చేస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అంట్ ఎకాలజీ, జాతీయ, అంతర్జాతీయ కరెంట్, హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఇండియన్ పాలటీ, ఇండియన్ ఎకనామీ నుంచి ప్రశ్నలు అడుగుతారు