పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఎన్నికల సంఘం,పెగాసస్, న్యాయవ్యవస్థ వంటి ఆయుధాలతో రాష్ట్రాల గళాన్ని కేంద్రం నొక్కిపెడుతోందని రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగంలో దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ల ప్రస్తావనే లేదన్నారు రాహుల్.
న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, పెగాసస్.. వంటి ఆయుధాలతో రాష్ట్రాలు, ప్రజల గొంతును కేంద్రం నొక్కిపెడుతోంది. నేను ఎమర్జెన్సీపై కూడా మాట్లాడతాను. దాని గురించి మాట్లాడేందుకు నేను భయపడను. ఎమర్జెన్సీని ఆనాడు కాంగ్రెస్ తొలగించింది. కానీ ఇప్పుడు మళ్లీ పాలిస్తోన్న వారికి ఆ ఆలోచన వచ్చింది. ఆర్‌ఎస్‌ఎస్, భాజపా.. మన దేశ పునాదులతో ఆడుకుంటున్నాయి. ఈ రెండు దేశం మధ్య సంబంధాలను బలహీనపరుస్తున్నాయి. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఆ ఇద్దరినీ మీరు కలిపారు..
వీటితో పాటు చైనా, పాకిస్థాన్ గురించి కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. తాము ఏం చేస్తున్నాం, ఏం చేయాలనేదానిపై చైనాకు ఓ స్పష్టత ఉందని రాహుల్ అన్నారు. చైనా, పాకిస్థాన్ దేశాల మధ్య దూరం పెరిగేలా చూడటమే భారత విదేశాంగ విధానాల్లో ప్రధానమైనదని రాహుల్ అన్నారు.
ఊహల్లో ఉన్నారా? మీ ముందు నిల్చొని ఉన్న అమేయమైన శక్తి (చైనా)ని తక్కువ అంచనా వేయకండి. మీరు పాకిస్థాన్, చైనాను ఏకతాటిపైకి తెచ్చారు. భారత్‌కు వ్యతిరేకంగా మీరు చేసిన అతిపెద్ద నేరం ఇదే. అసలు గణతంత్ర వేడుకలకు మీరు అతిథిని ఎందుకు తీసుకురాలేకపోయారో ఆలోచించండి. ప్రస్తుతం భారత్‌ను వివిధ దేశాలు చుట్టుముట్టాయి. శ్రీలంక, నేపాల్, బర్మా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, చైనా దేశాలకు మధ్య మనం ఉన్నాం. మన పరిస్థితి ఏంటో విరోధి దేశాలకు అర్థమైంది. - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
Also Read: TMC in Lok Sabha Polls: మోదీని గద్దె దించేందుకు దీదీ ప్లాన్.. 2024 ఎన్నికల్లో యూపీ నుంచి పోటీ!
Also Read: UP Election 2022: యూపీ మాజీ మంత్రులు మౌర్య, అభిషేక్ మిశ్రాకు టికెట్లు ఇచ్చిన ఎస్పీ