డ్రగ్స్ కేసులో బెయిల్ పొందిన షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ఆర్థర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారు. రెండు రోజుల కిందట ఆయనకు బాంబై హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్‌కు అవసరమైన పూచికత్తులు, ఇతర లాంఛనాలు పూర్తి చేసేందుకు సమయం పట్టడంతో శనివారం ఉదయం హాజరయ్యారు. ఆర్యన్‌తో పాటు ఆర్భాజ్ మర్చంట్, మున్ మున్ థమేచాలు కూడా విడుదలయ్యారు. వారి పాస్‌పోర్టులను కోర్టుకు స్వాధీనం చేశారు.




Also Read : న్యాయవాద బృందంతో షారుక్ ఖాన్ ఫొటో... ఆర్యన్ ఖాన్ బెయిల్ తర్వాత తొలిసారి... సత్యమేవ జయతే అని న్యాయవాది మానేషిండే ట్వీట్


26 రోజుల కిందట ముంబై నుంచి గోవా వెళ్లే క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీపై నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు రెయిడ్ చేశారు. ఆ పార్టీలో దొరికిన వారిని అరెస్ట్ చేశారు. మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినప్పటికీ ప్రచారం జరిగినా చివరికి షారుఖ్ కుమారుడితో పాటు మరో ఇద్దర్ని మాత్రమే జైలుకు పంపించారు. అప్పట్నుంచి పలుమార్లు కింది కోర్టుల్లో బెయిల్ కోసం ప్రయత్నించినా రాలేదు. చివరికి హైకోర్టులో బెయిల్ మంజూరు కావడంతో  విడుదలయ్యారు. ఆర్యన్ విడుదల సందర్భంగా షారుఖ్ అభిమానులు పెద్ద ఎత్తున ముంబైలోని ఆయన నివాసం మన్నత్ వద్దకు చేరుకున్నారు. అటు ఆర్థర్ రోడ్ జైలు వద్ద కూడా అభిమానులు గుమికూడారు. పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.


Also Read:  డ్రగ్స్ కేసులో కీలక సాక్షి గోసవీకి 8 రోజుల కస్టడీ విధించిన కోర్టు


డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ పట్టుబడినప్పటి నుండి అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుననాయి. ఆర్యన్‌పై అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా ఆరోపణలను ఎన్‌సీబీ అధికారులు చేశారు. ఆయనతో డ్రగ్స్ సంబంధాలు ఉన్నాయన్న కారణంగా హీరోయిన్ అనన్యపాండేను కూడా ప్రశ్నించారు. వారి మధ్య జరిగిన వాట్సాప్ చాట్‌ను కూడా మీడియాకు లీక్ చేశారు. అదే సమయంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సమీర్ వాంఖడేపై ఆరోపణలు వెల్లువెత్తాయి. డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నప్పుడు సాక్షులుగా చెప్పిన వారిలో ఇద్దరు ఎదురు తిరిగారు. వాంఖడే బాలీవుడ్ తారల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.


Also Read:  ఆర్యన్ ఖాన్‌ విడుదలపై మంత్రి ఆసక్తికర ట్వీట్.. 'పిక్చర్ అబీ బాకీ హై మేరా దోస్త్'!


సమీర్ వాంఖడేపై మూడు కేసులు కూడా నమోదయ్యాయి. వాటి విషయంలో అరెస్ట్ కాకుండా రక్షణ కోసం వాంఖడే ప్రయత్నించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. అరెస్ట్ చేసే పని అయితే మూడు రోజుల ముందు నోటీసులు ఇస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మొత్తంగా చూస్తే డ్రగ్స్ కేసు వ్యవహారం సంచలనాత్మకం అయింది. రాజకీయ దుమారం రేగింది. ఆర్యన్ బయటకు రావడంతో కేసులో హడావుడి కాస్త తగ్గే అవకాశం కనిపిస్తోంది.


Also Read : ఆర్యన్- అనన్యా మధ్య జరిగిన వాట్సాప్ ఛాట్ లీక్.. ఈ మెసేజ్‌లు చదివారా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి