అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన బాలుడు మిరాం తరోన్ (17)ని చైనా సైన్యం భారత్‌కు అప్పగించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. అధికారిక ప్రక్రియలతో పాటు, వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత బాలుడ్ని మన సైన్యానికి చైనా పీఎల్ఏ అప్పజెప్పిందని రిజిజు అన్నారు.
ఏమైంది?
షియాంగ్ జిల్లాలోని జిడో గ్రామానికి చెందిన ఎస్‌హెచ్ మిరాం తరోన్ (17).. జనవరి 18న తప్పిపోయాడు. తొలుత యువకుడిని చైనా సైన్యం అపహరించిందని వార్తలు వచ్చాయి. చైనా సైనికుల చెరనుంచి తప్పించుకున్న తరోన్ స్నేహితుడు.. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినట్లు అరుణాచల్ ప్రదేశ్ ఎంపీ తాపిర్ గో కూడా ట్వీట్ చేశారు.
అయితే, యువకుడు కిడ్నాప్ కాలేదని, తప్పిపోయాడని అధికారులు తర్వాత వివరణ ఇచ్చారు. దీనిపై చైనాతో భారత అధికారులు సంప్రదింపులు జరిపినట్లు కేంద్ర మంత్రి రిజిజు బుధవారం తెలిపారు. యువకుడిని భారత్‌కు అప్పజెప్పేందుకు చైనా సైన్యం సానుకూలంగా స్పందించింది. దీంతో ఈరోజు భారత ఆర్మీకి బాలుడ్ని పీఎల్ఏ అప్పగించింది.
Also Read: Covid-19 Update: దేశంలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదు.. 573 మంది మృతి