దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,03,71,500కు పెరిగింది. మొత్తం మరణాల సంఖ్య 4,91,700కు చేరింది. మరో 573 మంది వైరస్‌తో మృతి చెందారు. 








  • యాక్టివ్ కేసులు: 22,02,472

  • మొత్తం కేసులు: 4,03,71,500

  • మొత్తం మరణాలు: 4,91,700

  • మొత్తం కోలుకున్నవారు: 3,76,77,328


మొత్తం కేసుల సంఖ్యలో యాక్టివ్ కేసుల శాతం 5.46గా ఉంది. యాక్టివ్ కేసుల సంఖ్య 22,02,472కు తగ్గింది. రికవరీ రేటు 93.33 శాతంగా ఉంది.


వ్యాక్సినేషన్..







దేశంలో టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. బుధవారం ఒక్కరోజే 22,35,267 డోసులు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,63,84,39,207కు చేరింది.


తాజా అధ్యయనం..


ఒమిక్రాన్ వేరియంట్‌ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది తాజా అధ్యయనం. ఈ కరోనా వేరియంట్ ఇంత వేగంగా వ్యాప్తి చెందటానికి ప్రధాన కారణాన్ని వెల్లడించింది. పలు ఉపరితలాలపై ఒమిక్రాన్ ఎక్కువ కాలం సజీవంగా ఉండటమే ఇందుకు కారణమని తెలిపింది. కరోనా వైరస్​ ఇతర రకాలతో పోల్చితే ఒమిక్రాన్​ వేరియంట్​.. మనుషుల చర్మంపై 21 గంటలకుపైగా, ప్లాస్టిక్​ వస్తువులపై 8 రోజులకుపైగా జీవిస్తోందని ఈ అధ్యయనంలో తేలింది.