నిజామాబాద్‌లో మెడికో ఆత్మహత్య

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 25 Feb 2023 11:10 AM
నిజామాబాద్‌లో మెడికో ఆత్మహత్య

నిజామాబాద్‌లో ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫైనల్‌ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్న హర్ష అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది 

బంగారాన్ని పేస్టులా మార్చి తీసుకొచ్చిన ప్రయాణికుడు- పట్టుకున్న కస్టమ్స్ అధికారులు 

బంగారాన్ని పేస్ట్‌లా మార్చి దుబాయ్‌ నుంచి తీసుకొస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో ఆ వ్యక్తి చిక్కాడు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఈ ప్రయాణికుడు 823 గ్రాముల బంగారాన్ని తీసుకొస్తూ దొరికిపోయాడు. కస్టమ్స్ అధికారుల కళ్లుగప్పేందుకు బంగారాన్ని పేస్ట్‌లా మార్చి దుస్తుల్లో అమర్చుకున్నాడు. అయినా అధికారులకు అతన్ని పట్టుకొని బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పసిడి విలువ సుమారు 45 లక్షలు ఉంటుందని తెలిపారు కస్టమ్స్ అధికారులు

Background

తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడిని  పోలీసులు అరెస్టు చేశారు. ఈ తెల్లవారుజామున ఇంటిలోకి చొరబడి రవి నాయుడును తీసుకెళ్లారు పోలీసులు. నిన్న హలో లోకేష్ కార్యక్రమాన్ని డ్రోన్ల ద్వారా పోలీసులు రికార్డ్ చేశారు. దీనిపై రవినాయుడు తీవ్ర విమర్శలు చేశారు. పోలీసుల వైఖరిని తప్పు పట్టారు. 


ఇంటి నుంచి రవినాయుడి  అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు అలిపిరి స్టేషన్‌లో ఉంచినట్టు తెలుస్తోంది. అరెస్టుపై కుటుంబ సభ్యులు పార్టీ లీడర్లు మండిపడుతున్నారు. అసలు ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో చెప్పలేదని అంటున్నారు. తన భర్తకు ప్రాణ హాని ఉందని రవినాయుడి భార్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్‌స్టేషన్ తీసుకురాకుండా ఎక్కడి తీసుకెళ్లారని ప్రశ్నించారు. 


పోలీసుల తీరును ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా అని ప్రశ్నిస్తున్న పార్టీ లీడర్లు. రవి ఎక్కడ ఉన్నారో తెలియడం లేదని అంటున్నారు. కుటుంబ సభ్యులకైనా సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రవినాయుడుపై పోలీసుల దురుసు ప్రవర్తన సరైంది కాదంటున్నారు. 


అసలు నారా లోకేష్ చుట్టూ పోలీసులు డ్రోన్లను ఎందుకు ఎగురవేశారని ప్రశ్నిస్తున్న తెలుగుదేశం లీడర్లు. రవి అరెస్టుకు నిరసనగా అలిపిరి పోలీస్టేషన్ ముందు టిడిపి నేతలు ఆందోళన చేపట్టారు. అక్రమంగా అరెస్టు చేసిన రవి నాయుడును విడుదల చేయాలని నినాదాలు చేశారు. వారిని అక్కడి నుంచి తరలించారు పోలీసులు.


అసలేంటీ కార్యక్రమం - విద్యార్థులతో లోకేష్ ఏమన్నారు


హలో లోకేష్‌ పేరుతో విద్యార్థులతో ముఖాముఖీ నిర్వహించారు లోకేష్. పాదయాత్ర లో భాగంగా నారా లోకేష్ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను చెప్పాల్సింది చెప్పిన లోకేష్‌ తర్వాత విద్యార్థులు, యువత అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం, తన వెయిట్ లాస్‌, పింక్ డైమండ్‌ లాంటి చాలా అనుమానాలపై మాట్లాడి నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. 


జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆహ్వానిస్తారా అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా వందకు వంద శాతం ఆహ్వానిస్తామన్నారు. ఎవరైతే రాష్ట్రంలో మార్పు ఆహ్వానిస్తున్నారో... రాష్ట్రం అగ్రస్థానానికి ఆంధ్రులు అగ్రస్థానానికి వెళ్లాలని కోరుకునే వాళ్లంతా రాజకీయాల్లోకి రావాలన్నారు. రాజకీయాల్లో కావాల్సింది మంచి మనసు అన్నారు. అది ఉంటే ఏదైనా అదిగమించవచ్చన్నారు. తాను 2014లో పవన్‌ కలిసినప్పుడు మంచి మనసు చూశా అన్నారు. ఏపీలో మంచి ప్రభుత్వం రావాలి... ఏపీని ముందుకు తీసుకెళ్లాలనే తాపత్రయం చూశాను అన్నారు. అలాంటి వాళ్లు రాజకీయాల్లోకి రావాలన్నారు. అలాంటి వాళ్లు సమాజాన్ని ముందుకు నడిపించాలని సూచించారు. సినిమా స్టార్స్, పారిశ్రామికవేత్తలు, విద్యావంతులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. సమాజంలో మార్పు తీసుకురావాలాన్నా, రాజకీయాల్లో మార్పు తీసుకురావాలన్నా వీళ్లతోనే సాధ్యమన్నారు. అలాంటి వారంతా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. 


ఇప్పటికే తొమ్మిది శాతం పాదయాత్రే చేశారని ఇంకా నాలుగు వేల కిలోమీటర్లు నడవాల్సి ఉందని దీన్ని చేస్తారని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు తగ్గేదేలే అని సమాధానం చెప్పారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా పాదయాత్ర కొనసాగుతుందన్నారు లోకేష్. ప్రభుత్వం సహకరిస్తే పాదయాత్ర జరుగుతుందని... లేకుంటే దండయాత్ర చేస్తామన్నారు. వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామన్నారు. ఎన్ని సమస్యలు సృష్టించినా ఏపీ భవిష్యత్ కోసం చేస్తున్న పాదయాత్రలో తగ్గేదే లేదన్నారు. 









మీకు  ఉన్న విజ్ఞన్ ఏంటని అడిగిన ప్రశ్నకు సమాధానంగా... అన్నిరంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలబడాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఇంకా ఎన్ని రోజులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పని చేస్తామని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఒక్కో జిల్లాకు ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిందన్నారు. ఒక్కో జిల్లాను హైదరాబాద్‌లా తీర్చిదిద్దేలా చేయడమే తమ అజెండా అన్నారు.  


ఏపీలోని ప్రతి యువకుడికి ఉద్యోగాన్ని కల్పించి అదే రిటర్న్‌ గిఫ్ట్‌గా జగన్‌కు ఇస్తానన్నారు లోకేష్‌. యువతకు అనేక హామీలు ఇచ్చి మాట తప్పిన వ్యక్తికి అదే సరైన గుణపాఠంగా భావిస్తునట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండు బ్రాండ్లు ఉన్నాయని.. ఒకటి చంద్రబాబు అయితే ఇంకొకటి జగన్ అని చెప్పారు. చంద్రబాబు పేరు వింటే బిల్‌గేట్స్ లాంటి వాళ్లంతా ఆంధ్రప్రదేశ్‌వైపు చూస్తున్నారన్నారు. అదే రెండో బ్రాండ్‌ జగన్‌ మాత్రం ఎప్పుడూ జైలు వైపే చూస్తారన్నారు. అందుకే జైలు బ్రాండ్ కావాలా... లేకుంటే మన భవిష్యత్‌ను ఆయన బాధ్యతగా భావించే బాబు కావాలా అని ప్రశ్నించారు లోకేష్. 


బాలయ్యేనే మీ ఫేవరేట్ నటుడు అంటే... తాను మెగాస్టార్‌ చిరంజీవి ఫ్యాన్‌ను అన్నారు లోకేష్‌. ఏంతైనా బాలయ్య తన ముద్దులు మామయ్యని అన్నారు. బాలయ్య అన్‌స్టాపబుల్ అన్నారు. బాలయ్య సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఫస్ట్‌డే ఫస్ట్ షోలో లోకేష్ ఉంటారన్నారు. 


స్లిమ్‌గా ఫిట్‌గా ఉండటానికి కారణమేంటీ అంటే బ్రహ్మణీ అని సమాధానం చెప్పారు లోకేష్. కరోనా టైంలో తన డైట్‌ మొత్తాన్ని బ్రహ్మణీ మార్చేశారన్నారు. అంతకు ముందు ఇష్టం వచ్చినట్టు తినేసేవాడినని చెప్పారు. ఇప్పుడు పాదయాత్రలో కూడా అప్పుడప్పుడు ఇష్టం వచ్చినట్టు తింటున్నానంటూ వెల్లడించారు. ఏం తిన్నా వెంటనే తనకు మెసేజ్ వస్తుందన్నారు. 


పింక్‌డైమండ్‌ లొల్లి ఏంటని మరో విద్యార్థి ప్రశ్నించాడు. తన స్నేహితురాలికి గిఫ్ట్‌గా ఇవ్వాలంటూ చెప్పుకొచ్చాడా విద్యార్థి. ఈ లొల్లి ఏంటో తనకు అర్థం కాలేదన్నారు లోకేష్. ఇంకా వెతుకుతున్నాను అన్నారు. దీనికి విజయసాయిరెడ్డి మాత్రమే సమాధానం చెప్పాలన్నారు. వెంకటేశ్వర స్వామికి ఎలాంటి నష్టం చేయాలని చూసినా వాళ్లకు భవిష్యత్‌ లేదన్నారు. గతంలో ఈ పింక్‌డైమండ్‌పై విమర్శలు చేసిన వాళ్లు నాలుగేళ్లలో ఏం చేశారని ప్రశ్నించారు. ఆరోపణలు చేయడం చాలా తేలికని అన్నారు. తాను తప్పు చేయలేదని... అందుకే దర్జాగా నడిరోడ్డుపై పాదయాత్ర చేస్తున్నానని.. గెలిచిన వ్యక్తి మాత్రం పరదాల మాటున తిరుగుతున్నారని ఆరోపించారు. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.