పవన్ కల్యాణ్ చొరవ - 9 నెలల తర్వాత వీడిన యువతి మిస్సింగ్ మిస్టరీ - అసలు ట్విస్ట్ వేరే
భీమవరానికి చెందిన శివకుమారి కుమార్తె 9 నెలల కిందట మిస్ అయింది. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ.. పోలీసులు నిర్లక్ష్యం చేశారు. ఎవరికి గోడు వెళ్లబోసుకున్నా వినిపించుకున్న వారు లేరు. కానీ జనసేన అధినేత , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ కు  తమ బాధ వెల్లడించిన వారంలోనే వారికి ఉపశమనం లభించింది. వారి కుమార్తె ఆచూకీ తెలిసింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ ప్రజాదర్భార్ నిర్వహించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


విజయవాడలో వైఎస్ 75వ జయంతి కార్యక్రమం - రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కలకు షర్మిల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలతో సమావేశం అయ్యారు.  జూలై ఎనిమిదో తేదీన వైఎస్ 75వ జయంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విజయవాడలో భారీ ఏర్పాట్లు చేసుకుటున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్ని ఆహ్వానిస్తున్నారు. రాహుల్ గాంధీ కూడా వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
కాళే‌శ్వరం ఎందుకూ పనికిరాదని చెప్పిన వాళ్లంతా ఇప్పుడు దాని ఆధారంగా తెలంగాణకు నీళ్లు అందిస్తున్నారని విమర్శించారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌. ఇన్నాళ్లు దాంట్లో తప్పులు జరిగాయని అవినీతి రాజ్యమేలందని చెప్పిన వాళ్లంతా ఇప్పుడు లెంపలేసుకోవాలని నిన్న ట్వీట్ చేసిన కేటీఆర్ ఇవాళ మరో ట్వీట్ పెట్టారు. పక్కనే గోదావరి పారుతున్నా ఎడారిగా మారిన తెలంగాణలో జలసిరులు పారించింది కాళేశ్వరమన్నారు. తెలంగాణ ఎండిపోతే సంతోషిద్దామన్న వాళ్ల కళ్లు అసూయతో నిండిపోయేలా దండిగా నీళ్లు పారించామన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


సీఎం చంద్రబాబు ఇంటి స్థలానికి లంచం, డిప్యూటీ సర్వేయర్ నిర్వాకం..!
రాష్ట్రంలో కొంతమంది అధికారులు అవినీతి పతాక స్థాయికి చేరిపోయింది. అవతల వ్యక్తులు ఎవరన్న దానితో సంబంధం లేకుండా చేయి తడిపితే గాని పని చేయని స్థితికి అధికారులు దిగజారిపోయారు. రోజువారీ కలెక్షన్లు లక్ష్యంగా పెట్టుకుని చాలామంది అధికారులు పని చేస్తున్నారు. ఆ లక్ష్యాలను చేరితే గాని ఇంటికి వెళ్ళని అధికారులు రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంతోమంది ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రుణమాఫీ కోసం రేవంత్ సర్కారు కొత్త ఎత్తుగడ- బీఆర్‌ఎస్‌కు ఛాన్స్ ఇవ్వకుండా భారీ స్కెచ్‌
తెలంగాణలో రైతు రుణ మాఫీ చుట్టూ రాజకీయం అల్లుకుంటోంది. ప్రభుత్వం ఏర్పాటై ఇన్ని నెలలు గడుస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని నిలదీస్తూ వచ్చారు. కావాలనే ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. అయితే ఆగస్టును డెడ్‌లైన్‌గా ప్రకటించిన ప్రభుత్వం ప్రతిపక్షాలకు గట్టిసవాల్ చేసింది. అప్పటి నుంచి రాజకీయం మరింత  రంజుగా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి