ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,321 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 64,461 శాంపిళ్లను పరీక్షించగా ఈ మేరకు వెల్లడైందని పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 20,10,566కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికం చిత్తూరు (225), తూర్పు గోదావరి (218), కృష్ణా (153), పశ్చిమ గోదావరి (142), నెల్లూరు (139) జిల్లాల్లో నమోదయ్యాయి. 





గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కోవిడ్ కారణంగా ఏకంగా 19 మంది మరణించినట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. చిత్తూరు జిల్లాలో ఐదుగురు, కృష్ణా జిల్లాలో నలుగురు, నెల్లూరులో ముగ్గురు, ప్రకాశంలో ముగ్గురు, తూర్పు గోదావరి, గుంటూరు, కర్నూలు, శ్రీకాకుళంలలో ఒకరు చొప్పున మరణించినట్లు పేర్కొంది. గత 24 గంటల్లో కోవిడ్ బాధితుల్లో 1499 మంది కోలుకున్నారని.. వీరితో కలిపి మొత్తం రికవరీల సంఖ్య 19,81,906కిచేరిందని పేర్కొంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 14,853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


దేశంలో 46,759 కేసులు..
దేశంలో కోవిడ్​ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. వరుసగా మూడో రోజు 40 వేలకు పైగా నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తుంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 17,61,110 మందిని పరీక్షించగా.. 46,759 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. వీటిలో కేరళలోనే 32,801 కేసులు వచ్చాయి. నిన్నటితో పోలిస్తే దేశవ్యాప్తంగా కేసులు 4.7 శాతం మేర పెరిగాయి. గత 24 గంటల్లో కోవిడ్ బారిన పడిన వారిలో 509 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరితో కలిపి దేశవ్యాప్తంగా కోవిడ్ కారణంగా కన్నుమూసిన వారి సంఖ్య 4,37,370కి చేరింది. 


Also Read: Andhra Pradesh Coronavirus: పాఠశాలల్లో కరోనా భయం.. ప్రకాశం జిల్లాలో 28 మంది విద్యార్థులకు సోకిన మహమ్మారి


Also Read: Brazil Man Covid-19 Vaccine: 3 రకాల కోవిడ్ వ్యాక్సిన్లను 5 సార్లు తీసుకున్నాడు, చివరికి ఏమైందంటే..


Also Read: Uthra Murder Case: పాముతో సీన్ రీ కన్ స్ట్రక్షన్.. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇంట్రస్టింగ్ కేసు ఇది