ఏపీలోని పాఠశాల్లలో కరోనా కలవరం రేపుతోంది. కోవిడ్ నియమాలు పాటిస్తున్నప్పటికీ ప్రభుత్వ బడుల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఆగస్టు 16న ఏపీలో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. ప్రకాశం జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 28 మంది విద్యార్థులు, 48 మంది ఉపాధ్యాయులకు కరోనా సోకింది. శుక్రవారం కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ నిర్వహించిన సమీక్షలో జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావు ఈ విషయం తెలిపారు. పాఠశాలల్లో కరోనా నియమాలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. కేసులు నమోదైన పాఠశాలలను సందర్శించి వివరాలు టాస్క్‌ఫోర్స్‌ కమిటీకి తెలిపాలని సూచించారు. 


Also Read: Nirmal News: 10 నిమిషాల్లో ఇంటికి.. ఇంతలో ఘోరం.. పెళ్లి కూతురు, తండ్రి అక్కడికక్కడే మృతి


తల్లిదండ్రుల్లో ఆందోళన


దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండటంతో పలు రాష్ట్రాలు పాఠశాలలు తిరిగి ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆగష్టు 16వ తేదీ నుంచి పాఠశాలలు తెరిచింది. అయితే అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్ తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కేంద్రానికి నివేదిక అందించింది. దీంతో థర్డ్ వేవ్ భయాలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల వరుసగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కరోనా బారినపడడం గుబులు రేపుతున్నాయి.  కరోనా సోకిన విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని, వారందరికీ వైద్య సేవలు అందిస్తున్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కరోనా చదువులను సాగనివ్వడంలేదు. ఇప్పుటికే రెండేళ్లుగా చదువు సాగడంలేదు. 


Also Read: PK For YSRTP : జగన్ బాటలోనే షర్మిల రాజకీయ ప్రయాణం..!? ఇంతకీ ఆయన ఒప్పుకుంటాడా?


పెరుగుతున్న కేసులు


గత నాలుగు రోజుల్లో 43 మంది ఉపాద్యాయులు, 24 మంది విద్యార్థులు, నలుగురు బోధనేతర సిబ్బందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. ఉలవపాడు మండలం వీరేపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్‌, వెలిగండ్ల మండలం వెదుల్లచెరువు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఒంగోలు పీవీఆర్ బాలికల హైస్కూల్, డీఆర్ఎం మున్సిపల్ హైస్కూల్, దర్శి మండలం నిమ్మారెడ్డిపాలెం ప్రభుత్వం పాఠశాలలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 24న 35 మందికి, 25న 18 మందికి, 26న 11 మందికి, 27న ఏడుగురు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలుస్తోంది. 


 


Also Read: KCR SC Reservation : దళిత రిజర్వేషన్ల పెంపు అంశాన్ని తెరపైకి తెచ్చిన సీఎం కేసీఆర్ !