భారత ఆటో మొబైల్ మార్కెట్లోకి మరో మూడు బైక్‌లు ఎంట్రీ ఇచ్చాయి. ఖరీదైన బైక్‌ల తయారీ సంస్థ ఇండియన్ మోటార్ సైకిల్.. దేశీయ మార్కెట్‌లో తన కొత్త మోడల్ 'చీఫ్' బైక్‌లను విడుదల చేసింది. 2022 చీఫ్ సిరీస్ పేరిట విడుదలైన ఈ బైక్‌ల ప్రారంభ ధర రూ.20.75 లక్షలుగా (ఎక్స్ షోరూం ప్రకారం) ఉంది. చీఫ్ డార్క్ హార్స్, ఇండియన్ చీఫ్ బాబర్ డార్క్ హార్స్, ఇండియన్ సూపర్ చీఫ్ లిమిటెడ్ అనే మూడు వేరియంట్లను తీసుకొచ్చింది. వీటిని కొనుగోలు చేసుకోవాలనుకునే వారి కోసం ప్రీ బుకింగ్స్ ప్రారంభించామని కంపెనీ తెలిపింది. రూ.3 లక్షలు చెల్లించడం ద్వారా ఈ బైకును బుక్ చేసుకోవచ్చు.
ఆధునిక సాంకేతికతతో..
ఐకానిక్, అమెరికన్ వి ట్విన్ స్టైల్స్‌ని.. ఆధునిక సాంకేతికత, పనితీరుతో కలిపి ఇండియన్ మోటార్ సైకిల్ కొత్త చీఫ్‌ను రూపొందించింది. థండర్ స్టోక్ మోటార్‌తో రానున్న ఈ మూడు వేరియంట్లు అన్ని రకాల రైడర్లను ఆకర్షిస్తాయని కంపెనీ చెబుతోంది.
ఇండియన్ 'చీఫ్' బైకుల స్పెసిఫికేషన్లు..
ఇండియన్ చీఫ్ బైకులు.. 1,800 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తాయి. వీటిలో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) స్టాండర్డ్ ఫీచర్‌గా ఉండనుంది. ఇందులో సర్క్యులర్ టచ్ స్క్రీన్ రైడ్ అనే ఫీచర్ కూడా అందించారు. 15.1 లీటర్ల ఫ్యుయెల్ ట్యాంక్, బాబ్డ్ రియర్ ఫెండర్, ఎల్ఈడీ లైటింగ్, కీ లెస్ ఇగ్నిషన్ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు డ్యూయల్ ప్రీలోడ్ అడ్జటబుల్ రియర్ షాక్స్, డ్యుయల్ ఎగ్జాస్ట్, పైరెల్లి నైట్ డ్రాగన్ టైర్లను అందించారు.
క్రూయిజ్ కంట్రోల్ సపోర్టుతో పాటు ఇందులో స్పోర్ట్, స్టాండర్డ్, టూర్ అనే మూడు మోడ్స్ ఉంటాయని కంపెనీ పేర్కొంది. మనకు తగ్గినట్లుగా మోడ్స్ మార్చుకోవచ్చని తెలిపింది. ఇందులో 1626 మిమీ చిన్న వీల్ బేస్, 662 మిమీ తక్కువ సీట్ హైట్, వెట్ వెయిట్ 304 కేజీలుగా ఉన్నట్లు చెప్పింది.
Also Read: Mahindra Bolero Neo: మహీంద్రా బొలెరో నియోలో న్యూ వేరియంట్.. కొత్త పీచర్ ఏంటంటే?
Also Read: Tata Punch: పండుగ స్పెషల్‌గా ఎంట్రీ ఇవ్వనున్న టాటా మినీ ఎస్‌యూవీ పంచ్..