Andhra Pradessh and Telangana Top 5 news today on 30 October 2024
డిజిటల్ గవర్నెన్స్‌కు సహకరించండి- అమెజాన్‌ను కోరిన లోకేష్
అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) లాస్ వెగాస్‌లో నిర్వహిస్తున్న ఐటి సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో పాల్గొన్నారు. వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని వారికి రిక్వస్ట్ చేశారు. ఏపీలో ఉన్న మానవ వనరులు, భూమి లభ్యత, వాతావరణ పరిస్థితులు వారికి వివరించారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌ను కలిసి ఏపీలో పెట్టుబడుల అవకాశాలు పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు లోకేష్. పూర్తి వివరాలు
మోకిల పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రాజ్ పాకాల- జన్వాడ ఫామ్ హౌస్ కేసులో విచారణకు హాజరు
జన్వాడ ఫామ్ హౌస్‌లో జరిగిన మందుపార్టీ కేసులో విచారణ వేగవంతమైంది. ఈ కేసులో విచారణకు కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల హాజరయ్యారు. తన అడ్వకేట్‌తో కలిసి మోకిల పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అక్కడే విచారణ కొసాగుతోంది. జన్వాడ ఫామ్ హౌస్ కేసు సంచలనంగా మారింది. రాజకీయంగా కూడా పెను దుమారం రేగింది. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నారు. అందుకే ఈ కేసుపై అందరి దృష్టి నెలకొంది. పూర్తి వివరాలు
ఉమ్మడి ఆస్తులైతే ఎంవోయూపై ఎందుకు సంతకాలు చేశారు? విజయమ్మను ప్రశ్నించిన వైసీపీ
జగన్ -షర్మిల మధ్య నడుస్తున్న ఆస్తుల వివాదంపై తల్లి విజయమ్మ నిన్న ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. దీనికి వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్ లేఖ వచ్చింది. అనుకోని ఆపరిణామంతో షాక్‌కు తిన్న కౌంటర్ లేఖలో చాలా అంశాలపై ప్రస్తావించారు. మొత్తం 16 పాయింట్లతో ఉన్న ఈ లేఖలో జగన్ రాజకీయ ప్రత్యర్ధుల ట్రాప్‌లో విజయమ్మ పడ్డారని ఆరోపించారు. కోర్టు కేసులు పూర్తయ్యాక షర్మిలకు ఏమి ఇవ్వాలనేది తేలుస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలు
బీఆర్ఎస్‌పై దీపావళి బాంబులు పేల్చనున్న కాంగ్రెస్ - కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా ?
తెలంగాణలో పొలిటికల్ బాంబులు ఈ దీపావళి ముగిసిన వెంటనే గట్టిగా పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలు ప్రారంభమేనని రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో వేధింపులు ఉంటాయని పోరాటానికి అందరూ సిద్దంగా ఉండాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఖచ్చితమైన సమాచారం ఏదో లేకపోతే ఆయన అలా ట్వీట్ చేసి ఉండరని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. పూర్తి వివరాలు
శంషాబాద్‌లో 3 విమానాలకు బాంబు బెదిరింపు-అధికారుల అప్రమత్తం
విమానాలకు బాంబు బెదిరింపు ఆగడం లేదు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో మూడు విమానల్లో బాంబులు ఉన్నట్టు అధికారులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు మూడు విమానాలను ఆపిన అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో చెనై వెళ్లేందుకు రెండు ఇండిగో విమానాలు సిద్ధంగా ఉంటే... ఒకటి చెన్నై నుంచి వచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఎయిర్‌లైన్స్, హోటళ్లు, బ్యాంకులు, ఇతర ప్రాంతాలకు బాంబు బెదిరింపు కాల్స్ చేసిన నిందితుడిని మంగళవారం అరెస్టు చేశారు పోలీసులు. పూర్తి వివరాలు