నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) చేతిలో ఇప్పుడు అర డజను సినిమాలు ఉన్నాయి.‌ అందులో పాన్ ఇండియా సినిమాలు మూడు (పుష్ప 2, కుబేర, రెయిన్ బో) ఉన్నాయి.‌ మరో రెండు హిందీ సినిమాలు (సల్మాన్ ఖాన్ 'సికందర్', 'చావా'), ఓ తెలుగు సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్' ఉన్నాయి. దీపావళికి ఆవిడ కొత్త సినిమా ఒకటి అనౌన్స్ అయ్యింది. ఇప్పుడు చేస్తున్న సినిమాలు కంటే కొత్త సినిమా మీద అందరి చూపు పడింది. అందుకు కారణం ఏమిటో తెలుసా?


బాలీవుడ్ సూపర్ హిట్ హారర్ కామెడీలో...
ఎనిమిది వందల కోట్ల సినిమా తర్వాత!
బాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలో 800 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన సినిమాగా 'స్త్రీ 2' చరిత్ర సృష్టించింది. శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఆ సినిమా బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలతో ఆగస్టు 15న విడుదలై ఎవరు ఊహించని రీతిలో భారీ విజయం సాధించింది. 'స్త్రీ', 'మంజ్యా', 'బేడియా' వంటి హారర్ కామెడీలతో భారీ విషయాల్లో అందుకున్న మ్యాడ్ లాక్ ఫిల్మ్స్ సంస్థ అధినేత దినేష్ విజయన్ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో రష్మిక మందన్న సినిమా చేయనున్నారు. 


వైవిధ్యమైన కథలతో ఉత్తరాది ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న కథానాయకుడు ఆయుష్మాన్ ఖురానా (Ayushmann Khurrana). రష్మిక సంగతి చెప్పనవసరం లేదు. నేషనల్ క్రష్ అని ప్రేక్షకులు గుండెల్లో గూడు కట్టుకున్నారు. వాళ్ళిద్దరూ జంటగా హారర్ కామెడీ ఫ్రాంచైజీ / యూనివర్స్‌లో 'తమా'ను అనౌన్స్ చేశారు దినేష్ విజయన్. దీపావళి సందర్భంగా ఈ రోజు సినిమాను ప్రకటించడంతో పాటు ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు.



'స్త్రీ', 'మంజ్యా', 'బేడియా', 'స్త్రీ 2' క్రియేటర్స్ నుంచి వస్తున్న కొత్త సినిమా 'తమా' అని పేర్కొన్నారు. ఈ యూనివర్స్ కు ఓ ప్రేమ కథ అవసరం అని, అయితే దురదృష్టవశాత్తు అది బ్లడీ బ్యాక్‌ డ్రాప్ ఫిల్మ్ అని చిత్ర బృందం పేర్కొంది.


Also Read: సౌత్ సినిమా ఇండస్ట్రీలో విషాదం... సూర్య 'కంగువ' ఎడిటర్ నిషాద్ యూసుఫ్ మృతి






దీపావళి 2025న థియేటర్లలో 'తమా' విడుదల
ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న 'తమా' సినిమాలో పరేష్ రావేల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధాన తారాగణం.‌ ఈ చిత్రానికి ఆదిత్య సర్‌పోతదార్ దర్శకత్వం వహిస్తున్నారు ఇంతకు ముందు ఈ హారర్ కామెడీ ఫ్రాంచైజీలో 'ముంజ్యా' తీసిన అనుభవం ఆయనకు ఉంది. బాక్సాఫీస్ బరిలో ఆ సినిమా 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడీ 'తమా'ను వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. దినేష్ విజయన్, అమర్ కౌశిక్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.


Also Readకిరణ్ అబ్బవరం జర్నీకి నేను నంబర్ వన్ ఫ్యాన్... ట్రోలర్స్‌కు దిమ్మ తిరిగేలా నాగ చైతన్య స్పీచ్