Andhra Pradesh News Today: అదుపులోకి తాడిపత్రి, పల్నాడు అల్లర్లు - బలగాల నిఘా నీడలో చంద్రగిరి
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తరువాత జరిగిన పరిణామాలతో పల్నాడ జిల్లాలోని పలు ప్రాంతాలు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో పోలింగ్‌, ఆ తరువాత రోజు జరిగిన గొడవలు, దాడులతో భయానక వాతావరణం నెలకొంది. అనేక మంది తీవ్ర స్థాయిలో గాయపడగా, వాహనాలు పెద్ద ఎత్తున ధ్వంసం అయ్యాయి. గడిచిన మూడు రోజులు నుంచి పరిస్థితులు ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తిహార్ జైలులో కవితతో సమావేశమైన బీఆర్‌ఎస్ లీడర్లు
లిక్కర్ స్కామ్‌లో అరెస్టై జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితతో బీఆర్‌ఎస్‌ లీడర్లు ములాఖత్ అయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ పది గంటలకు తీహార్ జైలుకు వెళ్లి ఆమెతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్..." కవిత చాలా దైర్యంగా ఉన్నారు. నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాననే నమ్మకంతో ఉన్నారు. రాజకీయ దురుద్దేశంతో పెట్టిన కేసులని లాయర్‌కి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ అరెస్టు చేసిరంటేనే ఎంత దారుణంగా ఉన్నారో అర్థం అవుతుంది. రాత్రికి రాత్రి జడ్జిని మార్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బీఆర్ఎస్‌కు సపోర్టుగా విజయశాంతి - మారిన రాములమ్మ రాజకీయం
రాజకీయాల్లో కొంత  కాలంగా సైలెంట్ గా ఉన్న విజయశాంతి హఠాత్తుగా బీఆర్ఎస్‌కు మద్దతుగా తెరపైకి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత  బీఆర్ఎస్  ఉండదని కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను విజయశాంతి ఖండించారు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానమననారు.  ఈ దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ కనీసం ఆలోచన చెయ్యని అంశం బహుశా కిషన్ రెడ్డి గారి ప్రకటన భావం అని చెప్పుకొచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీలో హై అలర్ట్ - కౌంటింగ్ తర్వాత కూడా కేంద్ర బలగాల పహారా
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అత్యంత ఉద్రిక్తంగా మారుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాతనే పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. ఇక కౌంటింగ్ ముగిసిన తర్వాత ఇంకా భారీ హింస చోటు చేసుకుంటుందన్న  అభిప్రాయం వినిపిస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర ఇంటలిజెన్స్ ఏపీని హెచ్చరించింది.  జూన్‌ 4 తర్వాత ఏపీలో దాడులు జరిగే అవకాశం ఉందని క.. జూన్‌ 19 వరకు పోలీసు బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


గోదావరి జిల్లాల ఫలితాలపై భారీగా బెట్టింగ్‌లు- ఆ రెండు స్థానాలపైనే కోట్లలో పందేలు
ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు పోలింగ్ ఇటీవల జరిగింది. అభ్యర్థులు, వారి ఫాలోవర్స్‌ రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కానీ బెట్టింగ్‌ బంగార్రాజులు మాత్రం కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పందేలు జోరు పెంచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుండగా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ఇది వేరే లెవల్‌ అన్నట్టు ఉంది పరిస్థితి. సంక్రాంతి పండుగ రోజుల్లో పందేల బరుల వద్దే జరిగే పందేలు.. ఎన్నికల ఫలితాలపై మధ్యవర్తుల ద్వారా రూ.కోట్లలో 1.5 రేషియాలో పందేలు కాస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి