Telugu Breaking News Live: దళిత బంధుకు మరో రూ.500 కోట్లు విడుదల.. ఉత్తర్వులు జారీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆగస్టు 26న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 26 Aug 2021 02:52 PM
తెలంగాణలో కొత్తగా 357 కోవిడ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 357 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 81,193 కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఈ మేరకు వెల్లడయ్యాయి. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఈ మేరకు బులెటిన్‌ విడుదల చేసింది. గత 24 గంటల్లో కోవిడ్ కారణంగా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తెలంగాణలో కోవిడ్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 3,865కి చేరింది. నిన్న ఒక్క రోజే కోవిడ్ బాధితుల్లో 405 మంది కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 6,46,344కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,246 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  

నకిలీ చలానాల కేసులో ప్రధాన నిందితుడు అరెస్టు

కృష్ణా జిల్లాలో నకిలీ చలానాల కేసులో ప్రధాన నిందితుడైన స్టాంప్ వెండర్‌ రామ్ ధీరజ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.కోటి రూపాయల నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేశారు.  నకిలీ చలానాలతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్  లేదన్నారు. నిందితుల నుంచి నూరు శాతం నగదు రికవరీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

దళిత బంధు కోసం మరో రూ.500 కోట్లు విడుదల

దళిత బంధు విషయంలో తెలంగాణ ప్రభుత్వం వడివడిగా ముందుకు వెళ్తోంది. ఆ పథకం కోసం ప్రభుత్వం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టు కోసం దళిత బంధును ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా కేటాయించిన నిధులతో కలిపి ఇప్పటిదాకా హుజూరాబాద్‌లో దళిత బంధు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2 వేల కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కమిషన్‌ నిధులను ట్రాన్స్‌ఫర్ చేసింది.

సీఎంను కలిసిన స్టీఫెన్ రవీంద్ర

సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితులైన స్టీఫెన్ రవీంద్ర ఇవాళ ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు.



హైదరాబాద్‌లో నకిలీ డాక్టర్ హల్ చల్

ఉస్మానియా ఆస్పత్రిలో ఓ నకిలీ డాక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతను ఇంటర్ బైపీసీ మాత్రమే చదివి డాక్టర్‌గా చెలామణి అవుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. అఫ్జల్‌పై ఉస్మానియా క్యాజువాలిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతణ్ని అరెస్టు చేసిన పోలీసులు అఫ్జల్‌పై 170, 420, 419 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

వినాయక చవితికి బ్యాంకులకు సెలవు ప్రకటించని ఏపీ ప్రభుత్వం

సెప్టెంబరు 10న జరిగే వినాయక చవితి రోజు బ్యాంకులకు ఉండే సెలవును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ ప్రకారం సెలవు ఇవ్వాల్సి ఉంది. గడచిన ఏడాది వరకు ఇది కొనసాగింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కూడా వినాయక చవితికి సెలవును ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం మాత్రం సెలవు ప్రకటించలేదు. దీనిపై బ్యాంకు ఉద్యోగులు అసహనం వ్యక్యం చేస్తున్నారు. యునైటెడ్‌ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. దీనికి తెలంగాణలో బ్యాంకులు విడుదల చేసిన సెలవుల క్యాలెండర్‌ను జత చేసింది. 

మంత్రి మల్లారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు మంత్రి ఇంటి ముట్టడికి యత్నించారు. గురువారం యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. యూత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మంత్రి మల్లారెడ్డి ఇంటిపై కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేసేందుకు ప్రయత్నించారు.

కర్నూలు ఎస్పీకి లోకేశ్ లేఖ

టీడీపీ కార్యకర్త వాసి రామాంజనేయులు పట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ర్నూలు జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. వాసి రామాంజనేయులు పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తను పోలీసులు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రయోజనాల కోసం పోలీసులు విధుల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని లోకేశ్ ఎస్పీని కోరారు.  

తెలంగాణలో 19 మంది డీఎస్పీల బదిలీ.. ఉత్తర్వులు జారీ

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో 19 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, ఉమేష్ షరాఫ్‌, గోవింద్ సింగ్, రవిగుప్తాకు డీజీపీ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

దేశంలో తగ్గని కరోనా ఉద్ధృతి... కొత్తగా 46,164 కోవిడ్ కేసులు, 607 మరణాలు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,164 మందికి కరోనా సోకింది. 607 మరణాలు సంభవించాయి.  3,33,725 యాక్టివ్ కేసులు ఉండగా, 3,17,88,440 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 60.38 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. 

సీఎం జగన్ సిమ్లా టూర్

ఏపీ సీఎం జగన్ కుటుంబంతో కలిసి గురువారం ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లనున్నారు. సిమ్లా తదితర ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నట్లు సమాచారం. ఈ నెల 30 లేదా 31న ఆయన తన పర్యటన ముగించుకుని తిరిగి రాష్ట్రానికి వస్తారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. 

ఈ టైంలో ట్యాంక్ బండ్‌పైకి నో ఎంట్రీ

ట్యాంక్ బండ్‌పై ఇకపై ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. వచ్చే ఆదివారం నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని కమిషనర్ నగర ప్రజలకు తెలియజేశారు. పర్యటకుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వెల్లడించారు.

Background

హైదరాబాద్‌లో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. అంతేకాక, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో విపరీతమైన వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్, ఉప్పల్, బేగం‌పేట్, అమీర్ పేట్, సికింద్రాబాద్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో దాదాపు 45 నిమిషాల పాటు భారీ వర్షం పడింది. కోఠి, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్, బోయిన్ పల్లి, బాలానగర్, మూసాపేట్, ఎర్రగడ్డలో భారీగా వర్షం కురిసింది. వర్షపు నీరు లోతట్టు ప్రాంతల్లోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.


Also Read: Ahmedabad: కండోమ్ మర్చిపోయి.. ఆ పదార్థంతో లైంగిక చర్య, వెంటనే చనిపోయాడు!

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.