Andhra Pradesh Telangana Latest News Today: సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం - 'ప్రజాపాలన'కు శ్రీకారం
తెలంగాణ ప్రభుత్వం మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 'ప్రజా వాణి' పేరుతో ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరిస్తుండగా, పరిపాలనను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి, అక్కడే సమస్యలకు పరిష్కారం చూపేందుకు సిద్ధమైంది. ప్రజాపాలన (Prajapalana)పేరుతో ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు, పది రోజుల పాటు ప్రజాపాలన పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy ) శ్రీకారం చుట్టబోతున్నారు. ఆయా జిల్లాల్లో కలెక్టర్‌ నేతృత్వంలో ప్రత్యేక యంత్రాంగం, గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించి ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఎమ్మెల్యేల కంటే వాలంటీర్లకే ఎక్కువ అధికారం - జగన్ తీరుపై ఉండవల్లి హాట్ కామెంట్స్
రాజకీయాల్లో జగన్‌కు అంత అనుభవం లేదని సీట్లు మార్చే ప్రక్రియ సరి కాదని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.  రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన  రాజకీయాల్లో ( Politics ) త్యాగాలు చేయడానికి ఎవరూ రారు. సీటు లేదని చెప్పాలంటే దానికి చాలా అనుభవం ఉండాలన్నారు.  అటువంటి అనుభవం జగన్ మోహన్ రెడ్డికి ( Jagan mohan reddy ) ఉందని నేను అనుకోవడం లేదు. టికెట్లు మార్చే ప్రక్రియ సరికాదు. టికెట్లు ( Tickets ) మార్చకపోతే అక్కడ కేసీఆర్ ఓడిపోయారు.. మార్చితే ఇక్కడ జగన్ గెలుస్తారని అనుకోవడం కూడా సరికాదని ఉండవల్లి అన్నారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 


అక్రమ అరెస్టులపై కాదు అంగన్‌వాడిల సమస్యలపై దృష్టి పెట్టండి - సీఎం జగన్‌కు చంద్రబాబు సలహా!
అక్రమ అరెస్టులపై కాదు.. అంగన్‌వాడీల సమస్యలపై దృష్టిపెట్టండి అంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం 11 రోజులుగా సమ్మెలో ఉన్న అంగన్‌వాడీల నిరసనలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం జగన్ ప్రభుత్వ అహంకార దోరణికి నిదర్శనమని మండిపడ్డారు. సేవకు ప్రతిరూపంగా ఉన్న అంగన్‌వాడీల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్దితో ప్రయత్నం చేయకపోగా న్యాయం కోసం రోడ్డెక్కిన వారి నిరసనలను అణిచివేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.2014 నాటికి రూ. 4,200 వేతనం పొందుతున్న అంగన్‌వాడీలకు తమ ప్రభుత్వ హయాంలో రూ. 6,300 పెంచి రూ.10,500 చేశామని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


బీఆర్ఎస్ పాలనపై 'స్వేద పత్రం' విడుదల వాయిదా
బీఆర్ఎస్ (BRS) తొమ్మిదన్నరేళ్ల పాలనపై 'స్వేద పత్రం' (Swedapartram) విడుదల కార్యక్రమం వాయిదా పడింది. 'స్వేద పత్రం' పేరిట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (పీపీటీ) ను శనివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ వేదికగా ఇస్తామని ఆ పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. అయితే, పలు కారణాల రీత్యా ఈ కార్యక్రమం ఈ నెల 24కు (ఆదివారం) వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


ఏపీ కేజ్రీవాల్‌ అవుతారా? జేపీ, ప్రవీణ్‌కుమార్‌లా మిగిలిపోతారా?
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (VV Laxminarayana )రాజకీయ పార్టీ పేరును ప్రకటించారు. జై భారత్‌ నేషనల్‌ పార్టీ (Jai Bharath National Party)అంటూ ఆర్బాటంగా జనంలోకి వచ్చారు. ఐపీఎస్ అధికారిగా మంచి పేరు సంపాదించుకున్న వీవీ లక్ష్మీనారాయణ, ప్రజలకు ఇంకా ఏదో చేయాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో విశాఖపట్నం పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కొంతకాలం జనసేన పార్టీలో చేసినా... ఎక్కువకాలం ఉండలేకపోయారు. చట్టసభల్లో అడుగు పెట్టాలన్న లక్ష్యంతో నిరంతరం పని చేస్తున్నారు. ప్రజలకు దగ్గరయ్యేందుకు వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఏ పార్టీలో చేరకుండా సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి