Andhra Pradesh News Today | సీఎం రేవంత్ రెడ్డి టీమ్‌కు కేటీఆర్ ఆల్ ది బెస్ట్ - 'తనకు, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఫస్ట్' అంటూ ట్వీట్
తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు విదేశీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బృందానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నుంచి భారీ బృందం అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటనకు వెళ్లింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబుకు నా విషెష్. ఆల్ ది బెస్ట్' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణలో ప్రభుత్వ బృందం విజయం సాధించాలని ఆకాంక్షించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


Filmfare Awards కొల్లగొట్టిన బలగం, దసరా మూవీ టీంలకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
హైదరాబాద్: 69వ శోభ ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డుల కార్యక్రమం శనివారం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ లో కంటెంట్ బేస్డ్ సినిమాలు, గ్రౌండ్ రియాలిటీకి ప్రాధాన్యం ఇచ్చిన సినిమాలు అవార్డులు దక్కించుకున్నాయి. ఈ వేడుకలో బలగం, బేబీ, దసరా సినిమాలు అవార్డులు దక్కించుకున్నాయి. Filmfare Awardsలో బెస్ట్ మూవీగా బలగం సినిమా అవార్డు దక్కించుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


Nandyal News: నంద్యాల వైసీపీ నేత హత్య కేసులో పోలీసులు ఫెయిల్, ప్రూఫ్ చూపెట్టిన వైసీపీ
నంద్యాల జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేత హత్యకు గురి కావడంలో పోలీసుల పాత్ర ఉందని వైఎస్ఆర్ సీపీ ఆరోపించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ చేసింది. హత్య గురించి ఎస్పీకి ఫోన్ చేసి చెప్పినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఎస్పీకి 12:59 నుంచి 3:20 నిమిషాల వరకు ఐదు సార్లు ఫోన్లు చేసినా సకాలంలో స్పందించలేదని బాధితుడు నారపురెడ్డి వివరించారు. ‘‘వైఎస్ఆర్ సీపీ నేత హత్య సుబ్బారాయుడి కేసులో బయటపడ్డ పోలీసులు వైఫల్యం చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీపై లుక్ అవుట్ నోటీసులు? ఇంకా దొరకని వంశీ ఆచూకీ!
వైఎస్ఆర్ సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారని కొంత కాలంగా ఊహాగానాలు ఉన్న సంగతి తెలిసిందే. అరెస్టు భయంతో ఆయన అజ్ఞాతంలో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. పలువురు ఆయన విదేశాలకు వెళ్లిపోయారని చెబుతుండగా, మరికొంత మంది మాత్రం హైదరాబాద్ లోనే ఉన్నారని అంటున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విదేశాలకు వెళ్లకుండా పోలీసులు కొన్ని రోజుల కిందటే లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. అయితే, అంతకంటే ముందే ఆయన అమెరికాకు వెళ్లిపోయినట్లుగా వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి