విపత్తులు వచ్చినప్పుడు విలువైన సాయం అందించే కథానాయకులలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. కరోనా సమయంలో ఎంతో తెలుగు ప్రజలకు, చిత్రసీమ కార్మికులకు ఎంతో సేవ చేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఎప్పుడూ ముందుండే చిరంజీవి, తనది 'మెగా' మనసు అని మరోసారి చాటి చెప్పారు. కేరళలోని వయనాడ్ విధ్వంసం నేపథ్యంలో బాధితుల సహాయార్థం ఆయన మెగా విరాళం అందించారు. 


కేరళకు చిరు 'మెగా' విరాళం... కోటి సాయం!
''ప్రకృతి కన్నెర్ర చేయడంతో కేరళలో కొన్ని రోజులుగా జరుగుతున్న విధ్వంసానికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. వయనాడ్ బాధితులను తలుచుకుంటుంటే నా హృదయం కన్నీరు మున్నీరు అవుతోంది. నేను, చరణ్ (కుమారుడు రామ్ చరణ్) కలిసి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం. కేరళ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా'' అని చిరంజీవి ట్వీట్ చేశారు.


Also Readపిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా... పవన్ నియోజకవర్గంలోని కుక్కుటేశ్వర ఆలయంలో నిహారిక పూజలు






మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కోటి రూపాయలు విరాళంగా ఇవ్వడం పట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్ట కాలంలో ఉన్న ప్రజలకు సాయం అందించడానికి ఈ విధంగా ముందుకు రావడం మంచి పరిణామం అని చెబుతున్నారు.


Also Readరాజా సాబ్ మ్యూజిక్ అప్డేట్ ఇచ్చిన తమన్ - డార్లింగ్ ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ లోడింగ్!



కేరళ వయనాడ్ బాధితుల సాయం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా రూ. 10 లక్షలు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ రూ. 5 లక్షలు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్రసీమ నుంచి ప్రస్తుతానికి స్పందించిన సెలబ్రిటీలు వీళ్ళే. తమిళ స్టార్స్ చియాన్ విక్రమ్, సూర్య, కార్తీ సైతం తమ వంతు సాయం అందించారు. రాబోయే రెండు మూడు రోజుల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి మరింత మంది తారలు విరాళాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అవుతున్న తరుణంలో కేరళలో పలువురు హీరోలకు అభిమానులు ఉన్నారు.


Also Readదేవర పాటకు నయన్ భర్త లిరిక్స్ - ఆ నాలుగు భాషల్లో ఒక్కరే, తమిళ్‌కు సపరేట్ సింగర్