Devara Second Single: దేవర పాటకు నయన్ భర్త లిరిక్స్ - ఆ నాలుగు భాషల్లో ఒక్కరే, తమిళ్‌కు సపరేట్ సింగర్

Devara Songs Telugu: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద 'దేవర'లో రెండో సాంగ్ పాడిన సింగర్స్ ఎవరో రివీల్ చేశారు. అలాగే, కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు.

Continues below advertisement

Jr NTR and Janhvi Kapoor still from Devara movie: దేవర సినిమా యూనిట్ ఓ రొమాంటిక్ డ్యూయెట్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది. 'ఫియర్ సాంగ్' అంటూ మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోయిజం చూపించిన దర్శకుడు కొరటాల శివ... ఈసారి లవ్ యాంగిల్ ఆడియన్స్ ముందుకు తీసుకు రావడానికి రెడీ అయ్యారు. మరి, 'దేవర' సినిమా నుంచి వస్తున్న ఈ రెండో పాటను పాడింది ఎవరో తెలుసా?

Continues below advertisement

నాలుగు భాషల్లో శిల్పా రావు ఒక్కరే!
Devara Second Single Release Date: 'దేవర'లో రెండో పాటను ఆగస్టు 5... అంటే ఈ సోమవారం విడుదల చేయనున్నారు. ఈ విషయం ముందు చెప్పారు. అయితే, ఈ రోజు ఆ సాంగ్ పాడిన సింగర్స్ పేర్లు రివీల్ చేశారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో శిల్పా రావు పాడారు. తమిళం మాత్రం దీప్తి సురేష్ చేత పాడించారు.

తమిళంలో సాంగ్ రాసింది నయన్ భర్త!
తెలుగులో ఈ పాటకు 'సరస్వతీ పుత్ర' రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా... తమిళంలో లేడీ సూపర్ స్టార్ నయనతార భర్త విఘ్నేష్ శివన్, హిందీలో కౌసర్ మునీర్, మలయాళంలో మనకంబు గోపాలకృష్ణ, కన్నడలో వరదరాజ చిక్కబళ్లాపుర సాహిత్యం అందించారు. ఈ పాటకు బాస్కో మార్టిస్ నృత్య దర్శకత్వం వహించారు. అనిరుద్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

''మాటలు చిన్నబోయిన చోట సంగీతం మాట్లాడుతుంది' అని ఓ కోట్ ఉంది. ఈ ఆగస్టు 5 నుంచి 'దేవర' సెకండ్ సింగిల్ మీ కోట్ అవుతుంది'' అని చిత్ర నిర్మాణ సంస్థలు ఈ స్టిల్, చిన్న మ్యూజిక్ క్లిప్ కలిపి విడుదల చేశాయి. ఈ పాట కోసం అటు ఎన్టీఆర్, ఇటు జాన్వీ కపూర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.

Also Readతిరగబడర సామీ రివ్యూ: రాజ్ తరుణ్ ఇటువంటి సినిమాలు చేస్తే కెరీర్ తిరగబడుతుంది సామీ... డేంజర్ బెల్స్ మోగించిన డిజాస్టర్


Devara Movie Cast And Crew: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువసుధ ఆర్ట్స్‌ సంస్థలపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్. రెండో విలన్ రోల్ 'యానిమల్' ఫేమ్ బాబీ డియోల్ కి దక్కిందని టాక్. ఇంకా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Readప్రియదర్శి హీరోగా మరో సినిమా - కథానాయికగా ఫేమస్ కంటెంట్ క్రియేటర్.... ఆ డీటెయిల్స్ తెలుసా?

Continues below advertisement