69th Sobha Filmfare Awards South 2024 | హైదరాబాద్: 69వ శోభ ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డుల కార్యక్రమం శనివారం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డ్స్ లో కంటెంట్ బేస్డ్ సినిమాలు, గ్రౌండ్ రియాలిటీకి ప్రాధాన్యం ఇచ్చిన సినిమాలు అవార్డులు దక్కించుకున్నాయి. ఈ వేడుకలో బలగం, బేబీ, దసరా సినిమాలు అవార్డులు దక్కించుకున్నాయి. Filmfare Awardsలో బెస్ట్ మూవీగా బలగం సినిమా అవార్డు దక్కించుకుంది. 


కుటుంబ అనుబంధాలను చాటుతూ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డ్స్ లో ఉత్తమ చిత్రంగా, ఉత్తమ దర్శకుడుగా అవార్డులు అందుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పలు కేటగిరీల్లో ఈ సినిమా అవార్డులు కొల్లగొట్టడంతో Balagam చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు.






తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కి అవార్డులు సాధించిన మరో సినిమా Dasara Movie టీమ్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఉత్తమ నటుడుగా నాని, ఉత్తమ నటిగా కీర్తి సురేష్,  బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ గా శ్రీకాంత్ ఓదెల సహా పలు కేటగిరీల్లో దసరా మూవీ అవార్డులు కొల్లగొట్టింది. ఫిల్మ్ ఫేర్ సౌత్ అవార్డులు సాధించిన అందరికీ సీఎం రేవంత్ శుభాకాంక్షలు తెలిపారు.