History of Zero: 


సున్నా లేకపోయింటే ప్రపంచం పరిస్థితి ఏంటో. ఇప్పుడున్న విజ్ఞానం..ఈ టెక్నాలజీ అంతా సున్నా చుట్టూనే ఆధారపడిపోయి ఉంది. ప్రపంచానికి సున్నా అంటే ఏంటో తెలియకముందే భారత్ లో గణితశాస్త్రవేత్తలు సున్నాను వాడటం మొదలు పెట్టారు. శూన్యం అనే వాళ్లు దీన్ని.


ఆర్యభట్ట చేసిన అద్భుతం :


క్రీ.శ 476- 560 టైంలో గణిత శాస్ర్తవేత్త , ఆస్ట్రోనమర్ ఆర్యభట్ట మ్యాథమెటిక్స్ ఫేజ్ ను మార్చేశారనే చెప్పాలి. 23 ఏళ్ల వయస్సులో ఆయన రాసిన ఆర్యభట్టీయ, ఆర్య సిద్ధాంత గ్రంథాలు గణితశాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాయి. భూభ్రమణం, చంద్రభ్రమణం, చంద్రుడి కాంతి, భూమి డయామీటర్, పై కి నాలుగు డిజిట్ల వరకూ వ్యాల్యూ, Place value system and zero మీద మొదటిసారి రాసింది, దాన్ని గ్రంధస్తం చేసింది ఆర్యభట్టనే.
 
బ్రహ్మగుప్తుడి రచనల్లోనూ :


గ్రీకు, ఈజిప్ట్ నాగరికతలకు సున్నా తెలియదు. అంకెలను లెక్కించటానికి వాళ్లకంటూ ప్రత్యేకంగా పద్ధతులు ఉండేవి కానీ వాటితో చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. సున్నా తెలియకపోవటం వల్లనే సైన్స్ అడ్వాన్స్ మెంట్ అనుకున్నదానికంటే ఎక్కువ నెమ్మదిగా జరిగిందని చరిత్ర చెబుతోంది. ఆర్యభట్ట తర్వాత సున్నా ప్రస్తావన బ్రహ్మగుప్తుడి రచనల్లో కనిపిస్తుంది. క్రీ.శ 598 - 668 మధ్య ఆయన జీవించారు. బ్రహ్మగుప్త గణితం సిద్ధాంత, ఖండకాధ్యాక అనే గణిత గ్రంథాలను ఆయన రచించారు. బ్రహ్మగుప్తుడే తొలిసారిగా 'సున్నా' కు నియమాలను ప్రతిపాదించాడంటారు. అంతే కాదు 628 లో ఆయన గ్రావిటీ లాంటి అట్రాక్టింగ్ ఫోర్స్ ఒకటి ఉందని దాన్ని గురించి తన గ్రంథంలో రాశారు. గురుత్వాకర్సనం అనే పదాన్ని బ్రహ్మగుప్తుడు వాడారు.


భక్షాలీ లిపిలో ప్రపంచానికి :


గణితంలో భారత్ చేసిన ప్రయోగాలు ప్రపంచ దేశాలను ఆకర్షించాయి. ప్రత్యేకించి అరబ్బులు భారత్ కు రావటం ఇక్కడి గణిత నియమాలను నేర్చుకోవటం దాన్ని అరబ్ దేశాలకు తీసుకెళ్లటం ఇలా సున్నా అరబిక్ నెంబర్స్ లో భాగమైంది. 1881 లో ప్రస్తుత పాకిస్థాన్ లో ని పెషావర్ దగ్గర మర్దాన్ అనే ఊరికి సమీపంలోని భక్షాలీ అనే గ్రామంలో  ఓ రైతు భూమిని దున్నుతుంటే పురాతన లిపి ఉన్న చెట్టు కలప దొరికింది. దాని మీద రీసెర్చ్ చేసిన శాస్త్రవేత్తలకు తెలిసిన విషయం ఏంటంటే ఆ లిపి క్రీ.శ 224-383 కాలం నాటిది. దాన్ని భక్షాలి లిపి అని పేరు పెట్టారు. అది ఎందుకు అంత ఇంపార్టెంట్ అయ్యిందంటే ఆ లిపిలో తొలిసారిగా సున్నాను గుర్తించారు. ప్రపంచంలో ఇప్పటివరకూ సున్నాకు సంబంధించిన లభ్యమైన ఆధారాల్లో ఇదే పాతది అవటంతో సున్నా భారత్ నుంచే ప్రపంచానికి అందిందనే విషయానికి బలమైన ఆధారం లభించింది.



సున్నా లేని టెక్నాలజీ లేదు:


 సున్నా ప్రాచుర్యంలోకి వచ్చిన 700 సంవత్సరాల గానీ ప్రపంచదేశాలు అడాప్ట్ చేసుకోలేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా సున్నానే. అసలు కంప్యూటర్లు, ఈ ఆర్టిఫీషియల్ టెక్నాలజీ మనం ఎంత సైంటిఫిక్ అడ్వాన్డ్స్  అవుతున్నా అది 0,1 అనే బైనరీ కోడ్ తోనే అందులో సున్నా లేకపోయింటే ఇప్పుడున్న టెక్నాలజీ సాధ్యపడి ఉండేదే కాదు. సో ఈ రోజు మనం చూస్తున్న మనం చుట్టూ ఈ టెక్నాలజీ అంతా సున్నాపై ఆధారపడి ఉంది. సున్నా మానవ ప్రయాణం అంటే రెండు వేల సంవత్సరాల నాటి నాగరికతకు మళ్లీ వెళ్లటమే. 


Also Read: Queen Kubaba: ప్రపంచంలోనే మొట్టమొదటి క్వీన్ ఎవరో తెలుసా? మందు కలిపే మహిళే రాజ్యమేలిందట!