Anant Ambani Donates 20 Kg Gold Crown To Mumbais Lalbaugcha Ganesh : అంబానీలు ఏది ఇచ్చినా సాదాసీదాగా ఉండదు. ఓ రేంజ్ లో ఉంటంది. పైగా భక్తి భావం ఎక్కువగా ఉన్న అనంత్ అంబానీ.. గిఫ్టుగా ఇస్తే ఇక ఆ రేంజ్ లో ఉంటుంది. గణేష్ ఉత్సవాల్లో లాల్ భాగ్ గణేషుడికి ప్రత్యేకత ఉంది. అత్యధిక మంది దర్శించుకునే గణేశుు కూడా. ఆయనకు ఈ ఏడాది ప్రత్యేక అలంకరణ ఉంటుంది. అది.. పదిహేను కోట్ల రూపాయల విలువైన విగ్రహమే. దీన్ని తన పెళ్లి జరిగిన సందర్భంలో.. దేవుడికి సమర్పించుకుంటున్నారు.
లాల్ భాగ్ ఉత్సవ కమిటీలో అనంత్ అంబానీ కూడా
అనంత్ అంబానీకి దైవ భక్తి చాలా ఎక్కువ. ఆయన తిరుమలకు తరచూ వస్తూంటారు. ఇక గణేష్ ఉత్సవాల్లో లాల్ భాగ్ ఉత్సవ కమిటీలో ఆయన కీలక పాత్ర పోషిస్తారు. పదిహేనేళ్లుగా లాల్ భాగ్ ఉత్సవ కమిటీలో ఆయన కూడా ఉన్నారు. కరోనా సమయంలో లాలా భాగ్ గణేష్ కమిటీ సేవా కార్యక్రమాలకు నిధులు లోటు ఏర్పడితే అనంత్ అంబానీనే సహకిరంచారు. పెద్ద ఎత్తున ఆక్సీజన్ యూనిట్లు, డయాలసిస్ యంత్రాలు సమకూర్చారు. ఈ ఏడాది మరింత వైభవంగా లాల్ భాగ్ గణేష్ వేడుకలు నిర్వహించనున్నారు.
89 ఏళ్లుగా నిరంతరాయంగా జరుగుతున్న లాల్ భాగ్ గణేష్ ఉత్సవాలు
హైదరాబాదీలకు ఖైరతాబాద్ గణేషుడు ఎలానే ముంబై వాసులకు లాల్ భాగ్ గణేషుడు అలా అనుకోవచ్చు. వీఐపీలు.. బాలీవుడ్ స్టార్లు కూడా గణేశుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఓ రకంగా వీఐపీ రష్ ఉంటుంది. కోట్లకు కోట్లు విరాళిస్తారు కూడా. అందుకే కింగ్ ఆఫ్ లాల్ భాగ్‌గా పిలుస్తారు. 89 ఏళ్ల చరిత్ర ఈ గణేశుడికి ఉంది.
ఈ ఏడాది ఉత్సవాలను మరింత భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. ప్రత్యేకమైన అలంకరణలో గేణేశుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఈ క్రమంలో అనంత్ అంబానీ బహుకరించిన కిరీటం ప్రత్యేక ఆకర్షణ కానుంది.