దేశంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నాలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సమావేశం అయ్యారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన ఈ భేటీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో భద్రతా పరిస్థితులు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలు వంటి విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్‌ సింగ్‌ చౌహాన్‌‌, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే, బిహార్ సీఎం నితీష్‌ కుమార్‌‌, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించినప్పటికీ వారు హాజరుకాలేదు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అస్వస్థతకు గురవడంతో ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకున్నారు. దీంతో ఏపీ తరఫున మంత్రి హోంమంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. మిగతా మూడు రాష్ట్రాల తరఫున మంత్రులు, ఉన్నతాధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 


Also Read: Bandi Sanjay: దివ్యాంగులంటే కేసీఆర్‌కు ఎందుకంత చులకన? టీఆర్ఎస్‌పై బండి సంజయ్ ఆగ్రహం


ఆయా రాష్ట్రాల్లో శాంతి భద్రతలు, అభివృద్ధి కార్యక్రమాలు, మావోలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న కార్యకలాపాలపై సమీక్షించారు. దీంతో పాటుగా మావో ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు, స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలు, అభివృద్ధి కార్యక్రమాలు వంటి పలు అంశాలు చర్చకు వ‌చ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 



మావోల హింస తగ్గింది.. 
దేశంలో మావోయిస్టుల హింస గణనీయంగా తగ్గిందని కేంద్ర హోం మంత్రిత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని 45 జిల్లాల్లో నక్సల్స్ ఉనికి ఉన్నట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 90 జిల్లాలను మావో ప్రభావిత ప్రాంతాలుగా పరిగణిస్తున్నట్లు వెల్లడించాయి. నక్సల్స్ సమస్యను.. లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం (ఎల్‌డబ్ల్యూఈ) అని పిలుస్తున్నారు. 2019లో 61 జిల్లాలు.. 2020లో కేవలం 45 జిల్లాల్లో మాత్రమే నక్సల్స్ ప్రభావిత జిల్లాలుగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. 2015 నుంచి 2020 వరకు ఎల్‌డబ్ల్యూఈ ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 380 మంది భద్రతా సిబ్బంది.. వెయ్యి మంది పౌరులు.. 900 మంది నక్సల్స్ మరణించినట్లు తెలిపింది. అలాగే మొత్తం 4,200 మంది నక్సల్స్ లొంగిపోయినట్లు నివేదించింది. 






Also Read: AP Drugs Test Challenge: ఏపీలో వైట్ ఛాలెంజ్.. డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధమా అని టీడీపీ సవాల్... గంజాయి రవాణాతో సంబంధం లేదన్న వైసీపీ ఎమ్మెల్యే


Also Read: AP Ministers: పవన్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఫైర్... పవన్, సంపూర్ణేశ్ బాబు ఎవరైనా ఒక్కటే అని కామెంట్స్... క్షమాపణ చెప్పాలని డిమాండ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి