Weekly Horoscope 26 September to 2 October 2021: ఈ వారం ఈ మూడు రాశులవారు సక్సెస్ అవుతారు. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండండి ,మిగిలిన రాశులవారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

Continues below advertisement

2021 సెప్టెంబరు 26 ఆదివారం నుంచి అక్టోబరు 2 వరకూ రాశిఫలాలు

మేషం: మేషరాశివారికి ఆర్థికంగా కలిసొచ్చే రోజుది. అప్పిచ్చిన మొత్తం తిరిగి చేతికందుతుంది. వ్యాపారం బాగా జరుగుతుంది. ఆర్థికంగా కలిసొచ్చే అవకాశం. విద్యార్థులు అన్నింటా విజయం సాధిస్తారు. ఈ వారం మీరు నిర్వర్తించాలనుకున్న బాధ్యతలు పూర్తి చేయలేరు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు ఉండొచ్చు. అధిక ఖర్చుల కారణంగా ఒత్తిడికి గురవుతారు. కార్యాలయంలో సహోద్యోగి కారణంగా పైఅధికారులతో మీరు మాటలు పడాల్సి రావొచ్చు. పెండింగ్ పనులు పూర్తి చేయవచ్చు.

Continues below advertisement

వృషభం: మీరు సంఘర్షణ పరిస్థితికి దూరంగా ఉండాలి. పిల్లల వైపు నుంచి మంచి సమాచారం అందుతుంది. కెరీర్‌కు సంబంధించి మెరుగైన ఫలితాలు సాధిస్తారు. బంధువులను కలుస్తారు. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. మీ వ్యాపారం బాగా జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

మిథునం: మీ సమస్యలు తొలగిపోతాయి. కుటుంబ సభ్యుడి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కి అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. శత్రువులు చురుకుగా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి. మీ బంధువులతో ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు శుభసమయం.

కర్కాటకం: మీ దినచర్యలో కొద్దిపాటి మార్పులు చేసుకునేందుకు ప్రయత్నించండి. దేవుడిని ఆరాధించడంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మతపరమైన ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మరింత సామాజిక బాధ్యత పెరుగుతుంది. మీరు బంధువులను కలుస్తారు.

Also Read: Scholarship Programs: విద్యార్థులకు అదిరిపోయే అవకాశం.. చదువు కోసం స్కాలర్‌షిప్స్.. ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోండి..

సింహం: ఈ రోజు కొన్నిఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు లాభపడతారు. సహోద్యోగుల సహాయంతో కార్యాలయంలో మీ బాధ్యత నెరవేర్చగలరు. మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. వారం చివరిలో మీరు శుభవార్త వింటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

కన్య: మీ ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు ఉంటాయి. ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులు విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. పాత స్నేహితులను కలుస్తారు. ఇంట్లో వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి.

తుల: వ్యాపారస్తులు ఈ రోజు గందరగోళానికి గురవుతారు. అనవసర రిస్క్ తీసుకోవద్దు. అనారోగ్య సమస్యలున్నాయి. మీరు స్నేహితుల నుంచి శుభవార్తల పొందవచ్చు. ఓ పనిపై చాలాసార్లు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. స్నేహితులతో సమయం గడపగలుగుతారు. కార్యాలయంలో సహోద్యోగుల ప్రవర్తన అనుకూలంగా ఉంటుంది. మీరు డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన విషయాలు పరిష్కారమవుతాయి.

వృశ్చికం: వైవాహిక జీవితంలో కొన్ని తేడాలు తలెత్తవచ్చు. మీరు ఒత్తిడి తీసుకోవడం ద్వారా  ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉండొచ్చు. స్నేహితుల నుంచి శుభవార్తలు పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పూర్వీకులకు సంబంధించిన ఆస్తి విషయాలు పరిష్కారమవుతాయి. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

Also Read: Career Guidance: 2021లో డిమాండ్ ఉన్న 5 కోర్సులు ఇవే.. వీటిలో మీకేం కావాలో ఎంచుకోండి.. 

ధనుస్సు: విద్యార్థులకు చదువు విషయంలో ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగ అవకాశాల కోసం నిరుద్యోగులు కష్టపడాల్సిందే. కొత్త వ్యక్తులను కలుస్తారు. కార్యాలయంలో  బాధ్యతలు నిర్వర్తించగలుగుతారు. సామాజంలో ప్రశంసలు అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారం బాగా జరుగుతుంది.

మకరం: మీ వ్యాపారం బాగానే ఉంటుంది. కార్యాలయంలో సహోద్యోగితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పరిచయం లేని వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. మీ ప్రత్యర్థులు ఈ వారం చురుకుగా ఉంటారు. అనవసరమైన పనులు తలెత్తవద్దు. కుటుంబంలో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. చట్టపరమైన విషయాలు పెండింగ్‌లో ఉంటాయి. స్థిరాస్తికి సంబంధించి బంధువులతో వివాదాలు ఉండొచ్చు.

కుంభం: వ్యాపారంలో చికాకులుంటాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగస్తులకు కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఉద్యోగాలు మారే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుని ఆరోగ్యం క్షీణించవచ్చు. చికిత్సకు ఎక్కువ ఖర్చు అవుతుంది. వ్యాపార పరిస్థితులు చక్కబడతాయి. అప్పు ఇచ్చేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి.

మీనం: ఆఫీసులో బాధ్యతలు ఉన్నప్పటికీ కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించగలుగుతారు. ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. మీరు చేపట్టే కొత్త పని నుంచి ప్రయోజనం పొందుతారు. మీ ప్రవర్తన అందర్నీ ఆకట్టుకుంటుంది. కోపాన్ని నియంత్రించుకోండి.

Also Read: ‘ఫ్యామిలీ మ్యాన్’ టీమ్‌లోకి రెజీనా, రాశీ ఖన్నా.. బోల్డ్‌ సీన్లతో పిచ్చెక్కిస్తారట!

Also Read: మోహన్ బాబు గారూ.. వైఎస్ కుటుంబీకులు మీ బంధువులే కదా.. కావాలంటే నన్ను బ్యాన్ చేసుకోమని చెప్పండి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Continues below advertisement