పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన 'రిపబ్లిక్' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ ప్రభుత్వాన్ని, కొందరు మంత్రులను ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.. సినీ పెద్దలకు కూడా క్లాస్ పీకారు. వైసీపీ ప్రభుత్వం థియేటర్లు, టికెట్ల విషయంలో ఆంక్షలు విధిస్తుంటే.. సినీ పెద్దలు ప్రశ్నించాలని, ఈ విషయంలో అందరూ ఒకే మాటపై నిలబడాలని అన్నారు. 

 


 

ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని.. సినీ పెద్దలు కూడా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. ఈ క్రమంలో మోహన్ బాబు లాంటి సీనియర్ హీరోని కూడా మధ్యలోకి లాగారు పవన్ కళ్యాణ్. దీంతో మోహన్ బాబు 'మా' ఎన్నికలయ్యాక నీకు సమాధానం చెబుతా అంటూ పవన్ కి బదులిచ్చారు. నాని లాంటి యంగ్ హీరో పవన్ కి సపోర్ట్ చేస్తూ.. సినీ ఇండస్ట్రీని కాపాడాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని, సంబంధిత మంత్రులను కోరారు. 

 

తాజాగా మరో యంగ్ హీరో కార్తికేయ కూడా ఈ విషయంపై మాట్లాడారు. తను ఏ పార్టీకి సపోర్ట్ చేయడం లేదని.. అలానే ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని చెప్పిన కార్తికేయ.. సినీ ఇండస్ట్రీ పరిస్థితుల గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో నిజముందని.. సినీ ఇండస్ట్రీలో ఓ సభ్యుడిగా అందరి తరఫున మాట్లాడిన పవన్ కళ్యాణ్ సర్ కే నా సపోర్ట్ అంటూ కార్తికేయ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందింస్తున్నారు. 

 

కొందరేమో.. ''పెద్ద పెద్దోళ్ళే ముసుకు కూర్చున్నారు అన్నా.. రేపు వాళ్ళు బాగానే ఉంటారు.. నువ్వు బలిఅవుతావు.. అవసరమా చెప్పు'' అంటూ ఈ ఇష్యూకి దూరంగా ఉండమంటూ కార్తికేయకి సలహాలు ఇస్తున్నారు. మరికొందరేమో.. పెద్దవాళ్లే కాకుండా ఇండస్ట్రీలో యంగ్ స్టర్స్ కూడా ఈ విషయంపై మాట్లాడాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.