సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'రిపబ్లిక్' సినిమా అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడారు. రాజకీయంగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఏపీ ప్రభుత్వాలను, మంత్రులను పవన్ ప్రశ్నించిన తీరు హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో సినిమా ఇండస్ట్రీ పెద్దలకు కూడా క్లాస్ పీకారు పవన్. టికెట్ల విషయంలో ఇండస్ట్రీ గట్టిగా మాట్లాడాలంటూ ఆయన సూచించారు. 

 


 

పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో హీరో నాని గురించి కూడా మాట్లాడారు. 'టక్ జగదీష్' సినిమాను నాని ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అతడిని దారుణంగా ట్రోల్ చేశారు. ఇకపై నాని సినిమాలు థియేటర్లో విడుదల చేయనివ్వమని.. బ్యాన్ చేస్తామని బెదిరించారు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుచేసుకుంటూ.. 'థియేటర్ల యజమానులంతా ఆ అబ్బాయ్(నాని)పై పడితే తనేం చేస్తాడు.. దమ్ముంటే వెళ్లి వైసీపీ నాయకులతో మాట్లాడండి' అంటూ మండిపడ్డారు పవన్. 

 

తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్స్ పై హీరో నాని రియాక్ట్ అయ్యారు. 'పవన్ కళ్యాణ్ సర్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య రాజకీయ విబేధాలు ఎలా ఉన్నా కూడా వాటిని పక్కన పెడితే.. ఆయన సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల గురించి జెన్యూన్ గా మాట్లాడారు. దానిపై అందరూ దృష్టి పెట్టండి. సినిమా ఇండస్ట్రీలో సభ్యుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని, సంబంధిత మంత్రులను పరిశ్రమను కాపాడమని కోరుతున్నాను' అంటూ నాని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. ఈ ట్వీట్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ నానిని పొగుడుతుంటే.. వైసీపీ అభిమానులు మాత్రం తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు. 

 







Also read: సాయిపల్లవిలాంటి డ్యాన్సర్ ను ఎప్పుడూ చూడలేదు... ట్వీట్ లో మహేష్ ప్రశంసలు, చైతూ రెస్పాన్స్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి