ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ముగిసింది. ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ విమానాశ్రయంలో మోదీకి ఘన స్వాగతం లభించింది. భాజపా జాతీయ అధ్యక్షుడు జే.పీ నడ్డా సహా పలువురు పార్టీ సభ్యులు మోడీకి స్వాగతం పలికారు. మోడీకి స్వాగతం పలికేందుకు వేలాది మంది భాజపా కార్యకర్తలు, మోడీ మద్దతుదారులు విమానాశ్రయానికి తరలివెళ్లారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 22న ప్రధాని మోజీ అమెరికాకు పయనమయ్యారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో పాటు వివిధ వ్యాపార సంస్థ సీఈఓలతో సమావేశాలు అయ్యారు. మోజీ-బైడెన్ భేటీతో ఇరు దేశాల మైత్రి మరింత బలపడిందని అమెరికా తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలైన భారత్-అమెరికా మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఈ సమావేశంలో బైడెన్ అన్నారు. ఇరు దేశాల దృఢమైన బంధం కోసమే ఈ చర్చలని తెలిపారు. 40 లక్షల మంది ఇండో- అమెరికన్లు అగ్రరాజ్యాన్ని శక్తిమంతం చేస్తున్నారని మోడీతో అన్నారు. ఇరు దేశాల సబంధాల్లో ఈ భేటీ సరికొత్త అధ్యాయమని తెలిపారు.
ఈ సమావేశం ఎంతో కీలకమైందని మోడీ చెప్పారు. ఈ దశాబ్దం రూపుదిద్దుకోవడంలో అమెరికా నాయకత్వం కచ్చితంగా కీలక పాత్ర పోషిస్తుందని వ్యాఖ్యానించారు. భారత్-అమెరికా వాణిజ్యం భాగస్వామ్యం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం సాంకేతికతను వాడేలా మన ప్రతిభను వినియోగించుకోవాలన్నారు. భారత్- అమెరికా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్నాయని మోడీ పేర్కొన్నారు.
బైడెన్ నిర్వహించిన క్వాడ్ సమావేశంలోనూ మోడీ పాల్గొన్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిస్, జపాన్ ప్రధాని సుగాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 25న న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రసగించిన మోడీ.. అదే రోజున భారత్‌కు తిరుగుపయనమయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తో భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీ ఫొటోలివే..