American Airlines Incident:
మద్యం మత్తులో..
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళపై యూరినేట్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. దాదాపు 15 రోజుల పాటు విచారణ కొనసాగించిన పోలీసులు నిందితుడిని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సారి అమెరికాలో. అమెరికా ఎయిర్‌లైన్స్‌లో మద్యం మత్తులో ఓ ప్రయాణికుడు తన తోటి ప్యాసింజర్‌పై యూరినేట్ చేశాడు. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో ఈ ఘటన జరిగింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. AA292 American Airlines ఫ్లైట్‌లో ఈ సంఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. మార్చి 3వ తేదీన రాత్రి 9 గంటలకు బయల్దేరిన విమానం...మార్చి 4వ తేదీ రాత్రి 10 గంటలకు ల్యాండ్ అయింది. నిందితుడు అమెరికాలోని ఓ యూనివర్సిటీ విద్యార్థిగా గుర్తించారు. మద్యం మత్తులో స్నేహితుడిపైనే మూత్ర విసర్జన చేశాడు. ఎందుకిలా చేశావని పోలీసులు ప్రశ్నించగా "నాకు తెలియకుండానే అయిపోయింది" అని బదులిచ్చాడు. నిద్రలో ఉండగానే యూరిన్ లీక్ అయిందని, తన పక్కనే ఉన్న ప్రయాణికుడిపై పడిపోయినట్టు సిబ్బంది వెల్లడించింది. అయితే...ఈ తప్పు చేసినందుకు నిందితుడు క్షమాపణలు చెప్పినట్టు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేస్తే ఆ విద్యార్థి కెరీర్ పాడైపోతుందన్న ఉద్దేశంతో బాధితుడు ఫిర్యాదు చేయలేదు. అయితే అమెరికన్ ఎయిర్ లైన్స్ మాత్రం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుంది. Air Traffic Control (ATC)కి ఫిర్యాదు చేసింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు నిందితుడిని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు.
డీజీసీఏ సీరియస్
ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో మహిళపై ఓ వ్యక్తి యూరినేట్ చేసిన ఘటనలో విచారణ ఓ కొలిక్కి వచ్చింది. కానీ...ఆ కంపెనీ మాత్రం ఈ అంశాన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. సాఫ్ట్‌వేర్ ఆధారంగా విమానంలో జరిగే అన్ని యాక్టివిటీస్‌పైనా నిఘా పెట్టేందుకు సిద్ధమైంది. పొరపాటున ఇలాంటి సంఘటనలు జరిగితే...అందుకు సంబంధించిన సమాచారం అంతా సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేస్తారు. ఎయిర్ ఇండియాలోని ప్రతి అధికారికీ అందుకు సంబంధించిన అన్ని వివరాలు ఆ సాఫ్ట్‌వేర్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. పారిస్ నుంచి ఢిల్లీ వస్తున్న ఫ్లైట్‌లో ఓ వ్యక్తి మద్యం మత్తులో మహిళపై యూరినేట్ చేసిన ఘటన వివాదాస్పదమైంది. సిబ్బంది ఎంత చెప్పినా ఆ వ్యక్తి వినలేదని ప్రాథమిక విచారణలో తేలింది. ఆ తరవాత చాలా రోజుల పాటు పరారీలో ఉన్న నిందితుడుని బెంగళూరులో అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై డీజీసీఏ చర్యలు తీసుకుంది. ఎయిర్ ఇండియాకు 30 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆ ఘటన న్యూయార్క్ ఢిల్లీ విమానంలోని పైలట్ లైసెన్సును మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. తన విధులు నిర్వర్తించడంలో విఫలం అయినందుకు విమానాల్లో సేవలను పర్యవేక్షించే డైరెక్టర్ కు 3లక్షల రూపాయల ఫైన్ విధించింది.
Also Read: Top Philanthropists of India: వ్యాపారంలోనే కాదు, దాతృత్వంలోనూ వీళ్లే టాప్