Akasa Airlines Plane:
అకాసా ఎయిర్ లైన్స్‌ను ఢీకొట్టిన పక్షి
విమానాలు టేకాఫ్ అయినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేంత వరకూ క్షణక్షణ గండమే. ఎప్పుడు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తుందో అర్థం కాదు. అనుకోకుండా వాతావరణం మారినా..సమస్యలు తప్పవు. పైలట్ సహా సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉంటే పర్లేదు. కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా...భారీగా ప్రాణనష్టం వాటిల్లుతుంది. ఒక్కోసారి క్రూ అంతా అప్రమత్తంగానే ఉన్నా...అనుకోని అవాంతరాలు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా విమానాల విషయంలో "పక్షులు ఢీకొట్టడం" చాలా కామన్. ఒక్కోసారి పెను ప్రమాదాలకూ దారి తీస్తాయి ఇలాంటి ఘటనలు. మరి కొన్ని సార్లు భారీగా ఆర్థిక నష్టాన్ని మిగుల్చుతాయి. Akasa Air Lines కి ఇప్పుడిలాంటి పరిస్థితే ఎదురైంది. అహ్మదాబాద్ నుంచి ఢిల్లీకి
వస్తున్న ఈ ఫ్లైట్‌ని ఓ పక్షి బలంగా ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది విమానం. ఈ ఏడాది ఆగస్ట్‌లో Akasa AirLines ఫస్ట్ కమర్షియల్ ఫ్లైట్‌ను ప్రారంభించారు. అక్టోబర్ 27న Akasa B-737-8 ఎయిర్‌క్రాఫ్ట్‌కు పక్షి ఢీ కొట్టిందని Directorate General of Civil Aviation (DGCA)వెల్లడించింది. ల్యాండ్ అయిన తరవాత ఫ్లైట్ రాడోమ్ (Radome) డ్యామేజ్ అయినట్టు గుర్తించారు.
పక్షి ఢీకొడితే ఇంత నష్టమా..?
పక్షులు ఢీకొట్టడం వల్ల విమానాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. ఒక్కోసారి ఇంజిన్‌లో ఇరుక్కుపోవడం వల్లా ప్రమాదాలు సంభవిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా కమర్షియల్ ఫ్లైట్‌లు కేవలం పక్షులు ఢీకొట్టడం వల్ల ఏటా వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఏటా 1.2 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. అంటే...మన ఇండియన్ కరెన్సీలో రూ.7 వేల కోట్లు. టేకాఫ్ లేదా ల్యాండింగ్ అయ్యే సమయంలో పక్షులు విమానాలను ఢీకొడుతుంటాయి. ఈ సమయంలోనే అవి కొలైడ్ అవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.
తరచూ సాంకేతిక సమస్యలు..
ఈ మధ్య తరచుగా విమానాల్లో సాంకేతిక లోపాలు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఆ మధ్య గో ఫస్ట్ ఫ్లైట్ గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఓ పక్షి విమానాన్ని ఢీ కొట్టింది. దీంతో విమానాన్ని తిరిగి అహ్మదాబాద్ మళ్లించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తెలిపింది.
ఇటీవల విమానాలను అత్యవసరంగా ల్యాండింగ్ చేసేందుకు దారి మళ్లించిన సంఘటనలు పెరిగినట్లు పేర్కొంది. అయితే దేశీయ విమానాల్లో ఏర్పడుతున్న సాంకేతిక లోపాలు పెద్దవేమి కావని డీజీసీఏ ఇటీవల చెప్పుకొచ్చింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గతంలో పేర్కొన్నారు డీజీసీఏ చీఫ్ అరుణ్ కుమార్. లో-బడ్జెట్ విమాన ప్రయాణాలకు కేరాఫ్‌గా నిలిచిన స్పైస్‌జెట్ విమానయాన సంస్థ ఇటీవల చిక్కుల్లో పడింది. ఆ సంస్థకు చెందిన పలు విమానాలు సాంకేతిక లోపాల వల్ల ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవడం, ప్రమాదాలకు గురి కావడం జరిగింది. ఒకదానికి కాక్‌పిట్ విండ్ షీల్డ్ క్రేక్ కావడం వల్ల ముంబయిలో ల్యాండ్ చేయగా, మరొక విమానం.. సాంకేతిక లోపం కారణంగా పాకిస్థాన్ కరాచీలో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌పై DGCA సీరియస్ అయింది. తరచుగా స్పైస్‌జెట్ విమానాలు ప్రమాదానికి గురవుతుండటంతో సంస్థపై ఆంక్షలు విధించింది. 50 శాతం స్పైస్‌జెట్ సర్వీసులకు మాత్రమే డీజీసీఏ అనుమతి ఇచ్చింది. వింటర్ సీజన్ ప్రారంభమైనందున..ఈ ఆంక్షల్ని ఎత్తివేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించింది.
Also Read: Lingayat Seer Death Case: స్వామీజీ కేసులో సంచలన విషయాలు- మహిళతో వీడియో ఛాట్, హనీట్రాప్!