ABP  WhatsApp

Lingayat Seer Death Case: స్వామీజీ కేసులో సంచలన విషయాలు- మహిళతో వీడియో ఛాట్, హనీట్రాప్!

ABP Desam Updated at: 27 Oct 2022 02:41 PM (IST)
Edited By: Murali Krishna

Lingayat Seer Death Case: కర్ణాటకకు చెందిన మఠాధిపతి బసవలింగ మహాస్వామి బలవన్మరణం కేసులో కీలక విషయాలు బయటపడ్డాయి.

స్వామీజీ కేసులో సంచలన విషయాలు- మహిళతో వీడియో ఛాట్, హనీట్రాప్!

NEXT PREV

Lingayat Seer Death Case: కర్ణాటకలో మఠాధిపతి బసవలింగ మహాస్వామి కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఆయన బలవన్మరణానికి పాల్పడటం వెనుక హనీట్రాప్ కోణం ఉందని తెలిసింది. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


ఇదీ సంగతి


కంచుగల్‌ బండె మఠాధిపతి బసవలింగ మహాస్వామి సోమవారం వేకువజామున ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్వామీజీ బలవన్మరణానికి పాల్పడం పెద్ద చర్చకు దారితీసింది. అయితే ఓ మహిళను అడ్డంపెట్టుకుని స్వామీజీని కొందరు హనీట్రాప్‌ చేశారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. 


వీడియో ఛాటింగ్


బెంగళూరుకు చెందిన ఓ మహిళతో స్వామీజీ కొద్ది రోజులుగా వీడియో ఛాటింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఆ ఛాటింగ్‌ను, వీడియోలను బయటపెడతామని బెదిరింపులు రావడంతోనే ఆయన మానసిక ఆందోళనకు లోనై ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయాలను ఆయన తన సూసైడ్ నోట్‌లో కూడా ప్రస్తావించినట్లు సమాచారం.



స్వామీజీ తన డెత్‌ నోట్‌లో కొందరి పేర్లను ప్రస్తావించారు. కానీ ఆయన మరణానికి, సూసైడ్‌ నోట్‌లో ఉన్న వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదు. మాగడిలోని కుదూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా నిందితులుగా ఇంకా ఎవరి పేర్లూ చేర్చలేదు. స్వామీజీ నిజంగానే వేధింపులకు గురయ్యారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. కేసులో ఎవరెవరు ఉన్నారనేది దర్యాప్తు ద్వారా తెలుస్తుంది.                     -   సంతోష్‌ బాబు, రామనగర్‌ ఎస్‌పీ


Also Read: Gujarat Assembly Polls: ఈసీ షాకింగ్ నిర్ణయం- గుజరాత్‌లో 900 మంది అధికారులు బదిలీ!

Published at: 27 Oct 2022 02:27 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.