Trisha Entering Politics: 


కాంగ్రెస్‌లో చేరుతున్నారా..? 


సినీనటి త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా..? ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. తమిళ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఓ పార్టీలో ఆమె త్వరలోనే చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరైతే..ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నారని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. దళపతి విజయ్ ఆమెను రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేక పోయినా...చాలా వరకు తమిళ సైట్లు ఈ వార్తలు రాస్తున్నాయి. ఇటీవలే ఆమె "పరమపదం విలయాట్టు" అనే తమిళ్ పొలిటికల్ థ్రిల్లర్‌లో నటించారు. ఆ తరవాతే ఈ వార్తలు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. 1996 నుంచి ఆమె కాంగ్రెస్‌ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారని, ఎప్పటికైనా ఆ పార్టీలోనే చేరే అవకాశాలున్నాయని సమాచారం. డీఎమ్‌కే, అన్నాడీఎమ్‌కేని కాదని కాంగ్రెస్‌లో చేరతారా..? అన్నది సస్పెన్స్‌గా ఉంది. నిజానికి తమిళనాట సినీనటులు, రాజకీయ నేతలుగా మారటం ఓ సంప్రదాయంగా మారిపోయింది. ఎమ్‌జీ రామచంద్రన్, జయలలిత ఈ బాటలు వేశారు. అయితే...జయలలిత తరవాత రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నటులు..పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. విజయ్ కాంత్, ఖుష్బూ రాజకీయాల్లోకి వచ్చినా...రాణించలేకపోయారు. చివరకు కాంగ్రెస్‌ను వదిలి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ప్రస్తుతం త్రిష విషయంలో వస్తున్న రూమర్స్ నిజమైతే...రాష్ట్రంలోని రాజకీయాలు మరోసారి సినిమా రంగు పూసుకుంటాయి. 


వరుస చిత్రాలు..


ప్రస్తుతానికి త్రిష వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మణిరత్నం చిత్రం "పొన్నియన్ సెల్వన్‌"లో ఓ కీలక పాత్రలో నటించారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ చిత్రం హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఆ తరవాత అక్టోబర్‌ 7వ తేదీన "సతురంగ వెట్టాయ్ 2" మూవీ విడుదల కానుంది. వీటితో పాటు మలయాళంలో  "రామ్" చిత్రంలో నటిస్తున్నారు. తమిళ్‌లోనూ "ది రోడ్" (The Road) మూవీలోనూ కనిపించనున్నారు.













 


Also Read: Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' - ఆ ఫ్యాక్టర్ ఎఫెక్ట్ చేయదు కదా?


Also Read: Jr Ntr Meets Amit shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ భేటీ, ఎందుకంటే?