యంగ్ హీరో నిఖిల్ నటించిన 'కార్తికేయ2' సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. వాయిదాల మీద వాయిదాలు పడ్డ ఈ సినిమా ఫైనల్ గా ఆగస్టు 13న విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అదే రేంజ్ లో కలెక్షన్స్ ను కూడా సాధిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సత్తా చాటుతోంది. సినీ ప్రేక్షకులతో పాటు.. సెలబ్రిటీలు కూడా 'కార్తికేయ2' సక్సెస్ పై స్పందిస్తున్నారు. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది.


తాజాగా ఈ సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. రెండో వారానికి 'కార్తికేయ2' సినిమా ఆమిర్ ఖాన్ 'లాల్ సింగ్ చడ్డా', అక్షయ్ కుమార్ 'రక్షాబంధన్' సినిమాల కంటే డబుల్ కలెక్షన్స్ రాబట్టిందని.. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్', ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్2' సినిమాల కంటే బ్లాక్ బస్టర్ గా నిలిచిందంటూ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటికి కంగ్రాట్స్ చెప్పారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ లను ట్యాగ్ చేస్తూ వర్మ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. 


Karthikeya 2 World Wide Collection Till Now - First Week : తెలుగు రాష్ట్రాల్లో కూడా 'కార్తికేయ 2'కు అద్భుత ఆదరణ లభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు రూ. 3.50 కోట్లు, రెండో రోజు రూ. 3.81 కోట్లు, మూడో రోజు రూ. 4.23 కోట్లు, నాలుగో రోజు రూ. 2.17 కోట్లు, ఐదో రోజు రూ. 1.64 కోట్లు, ఆరో రోజు రూ. 1.34 కోట్లు, ఏడో రోజు రూ. 2.04 కోట్లు వసూలు చేసింది. 


ప్రాంతాల వారీగా తెలుగులో కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది ఒక్కసారి చూస్తే..
నైజాం : రూ.  7.02 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ.  2.59 కోట్లు
సీడెడ్ : రూ. 2.91 కోట్లు
నెల్లూరు :  రూ. 59 లక్షలు
గుంటూరు :  రూ. 1.65 కోట్లు
కృష్ణా జిల్లా : రూ. 1.02 కోట్లు
తూర్పు గోదావ‌రి : రూ. 1.36 కోట్లు
పశ్చిమ గోదావ‌రి : రూ. 1.03 కోట్లు


రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజులకు 'కార్తికేయ 2' సినిమా రూ. 29.55 కోట్ల గ్రాస్ (షేర్ వసూళ్లు రూ.18.69) కలెక్ట్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా, కర్ణాటకలో రూ. 1.64 కోట్లు, ఓవర్సీస్ మార్కెట్‌లో రూ. 3.25 కోట్లు, హిందీలో 4.45 కోట్లు (షేర్) వసూలు చేసింది.
 చందూ మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ (Abhishek Agarwal) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) కథానాయికగా నటించారు. శ్రీనివాస రెడ్డి (Srinivasa Reddy) 'వైవా' హర్ష చెముడు హీరో హీరోయిన్లతో పాటు ట్రావెల్ చేసే పాత్రలలో కనిపించారు. 


Also Read : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రచ్చ షురూ - బాలీవుడ్ బాయ్‌కాట్ గ్యాంగ్‌కు దిమ్మ‌తిరిగే రియాక్షన్


Also Read : సిక్స్ ప్యాక్ చూపించడానికి రెడీ అవుతున్న మహేష్ బాబు!