సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) అభిమానులకు ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ శనివారం నాడు షాకింగ్ స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చారు. అదేంటంటే... షర్ట్ లెస్ ఫోటోస్! మహేష్ బాబు షర్ట్ తీసేసి, స్విమ్మింగ్ చేస్తున్న ఫోటోలను నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హీరో షర్ట్ తీయడం పెద్ద విశేషమా? అని కొంత మంది అనుకోవచ్చు. మహేష్ బాబు షర్ట్ తీసేయడం విశేషమే!


హీరోలు సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ చూపించడం సహజమే. ఎందుకంటే... మన తెలుగు యువ కథానాయకులు తమ కండలు తిరిగిన దేహాలను వెండితెరపై చూపించారు. అయితే... ఆ ట్రెండ్ కు మహేష్ బాబు దూరమే. 'వన్ నేనొక్కడినే' సినిమా కోసం ఆయన సిక్స్ ప్యాక్ ట్రై చేశారు. అయితే... ముఖంలో మార్పులు వస్తున్నాయని ముందుగా గమనించి ఆ ప్రయత్నం విరమించుకున్నారు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ షర్ట్ తీసేసిన ఫోటోలను ఆయన పోస్ట్ చేయలేదు. అటువంటి మహేష్ బాబు షర్ట్ తీసేస్తే (Mahesh Babu Shirtless Pics) విశేషమే కదా?


సిక్స్ ప్యాక్ చూపించడానికి మహేష్ రెడీ అవుతున్నారా?
మహేష్ బాబు షర్ట్ లెస్ ఫోటోలు చూసిన తర్వాత సూపర్ స్టార్ అభిమానులకు ఒక సందేహం వచ్చింది. ఆయన సిక్స్ ప్యాక్ చూపించడానికి రెడీ అవుతున్నారా? అని! ఎందుకంటే... రీసెంట్‌గా ఫిట్‌నెస్‌ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ ఒక ఫోటో ట్వీట్ చేశారు. అందులో ఆయన మహేష్ బాబుతో ఉన్నారు. సో... సూపర్ స్టార్‌కు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా చేస్తున్నారని ఈజీగా అర్థం అయ్యింది. 'అరవింద సమేత వీర రాఘవ', 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలకు ఎన్టీఆర్ స్టీవెన్స్ దగ్గర ట్రైన్ అయ్యారు. ఇప్పుడు మహేష్ బాబుతో ఆయన కనిపించడంతో సూపర్ స్టార్ సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నారని భావిస్తున్నారు (Mahesh Babu Six Pack Loading).


'అరవింద...'లో ఎన్టీఆర్ ఇంట్రో ఫైట్ లాంటిది...
యాక్షన్ సీన్స్‌లో మహేష్ బాబు సిక్స్ ప్యాక్‌లో చూడాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అందులో 'అరవింద సమేత వీర రాఘవ'లో ఎన్టీఆర్ ఇంట్రో ఫైట్ లాంటిది ఒకటి డిజైన్ చేయమని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ను ఘట్టమనేని అభిమానులు కోరుతున్నారు. మరి, మహేష్ ఏమంటారో చూడాలి. ఇండస్ట్రీ హిట్ 'పోకిరి' విడుదలైన ఏప్రిల్ 28న ఈ సినిమా (SSMB28) ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్న సంగతి తెలిసిందే. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి, వచ్చే ఏడాది వేసవికి విడుదల చేస్తామని చిత్రనిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఇటీవల వెల్లడించింది.


Also Read : తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?


'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్'... రాజమౌళి సినిమాల్లో హీరోలు షర్ట్ తీసేసి కనిపించారు. ఇప్పుడు మహేష్ బాబును కూడా ఆ విధంగా చూడాలనేది ఫ్యాన్స్ కోరిక. షర్ట్ లెస్ ఫోటోలు చూసిన రాజమౌళి ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దామంటూ మహేష్ బాబుకు ఫోన్ చేసినట్లు కొన్ని మీమ్స్ వచ్చాయి (Mahesh Rajamouli Film). 



Also Read : హైవే రివ్యూ : విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ విజయం అందుకున్నారా? లేదా?



మహేష్ బాబు షర్ట్ లెస్ ఫోటోలపై చాలా మీమ్స్ వస్తున్నాయి. అందులో కొన్ని మీమ్స్ మీ కోసం... ఇంకెందుకు ఆలస్యం? చూడండి మరి!