ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో: త్రిష 


సినీనటి త్రిష రాజకీయ ఎంట్రీపై స్పష్టతనిచ్చారు..! ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమెను పొలిటికల్ ఎంట్రీపై ప్రశ్నించగా..అదేమీ లేదని తేల్చి చెప్పారు. "ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి పుడతాయో నాకర్థం కావట్లేదు. నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవటం లేదు. అసలు అలాంటి ప్లానే లేదు" అని త్రిష సమాధానమిచ్చారట. ఆమె కాంగ్రెస్‌లో చేరతారన్న ఊహాగానాలపై...అటు ఆ పార్టీ కూడా క్లారిటీ ఇచ్చింది. త్రిషను తమ పార్టీలోకి ఆహ్వానించలేదని వెల్లడించింది. మొత్తానికి ఇది ఒట్టి పుకారేనని తేలింది. 


కొంత కాలంగా గుసగుసలు..


కొద్ది కాలంగా సినీనటి త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ కోలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఓ పార్టీలో ఆమె త్వరలోనే చేరతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరైతే..ఆమె కాంగ్రెస్‌లో చేరనున్నారని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. దళపతి విజయ్ ఆమెను రాజకీయాల్లోకి వెళ్లాలని ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా...చాలా వరకు తమిళ సైట్లు ఈ వార్తలు రాస్తున్నాయి. ఇటీవలే ఆమె "పరమపదం విలయాట్టు" అనే తమిళ్ పొలిటికల్ థ్రిల్లర్‌లో నటించారు. ఆ తరవాతే ఈ వార్తలు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. 1996 నుంచి ఆమె కాంగ్రెస్‌ పార్టీతో సన్నిహితంగా ఉంటున్నారని, ఎప్పటికైనా ఆ పార్టీలోనే చేరే అవకాశాలున్నాయని సమాచారం. డీఎమ్‌కే, అన్నాడీఎమ్‌కేని కాదని కాంగ్రెస్‌లో చేరతారా..? అన్నది సస్పెన్స్‌గా ఉంది. నిజానికి తమిళనాట సినీనటులు, రాజకీయ నేతలుగా మారటం ఓ సంప్రదాయంగా మారిపోయింది. ఎమ్‌జీ రామచంద్రన్, జయలలిత ఈ బాటలు వేశారు. అయితే...జయలలిత తరవాత రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నటులు..పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. విజయ్ కాంత్, ఖుష్బూ రాజకీయాల్లోకి వచ్చినా...రాణించలేకపోయారు. చివరకు కాంగ్రెస్‌ను వదిలి భాజపా తీర్థం పుచ్చుకున్నారు.


ప్రస్తుతానికి త్రిష వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మణిరత్నం చిత్రం "పొన్నియన్ సెల్వన్‌"లో ఓ కీలక పాత్రలో నటించారు. సెప్టెంబర్ 30వ తేదీన ఈ చిత్రం హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఆ తరవాత అక్టోబర్‌ 7వ తేదీన "సతురంగ వెట్టాయ్ 2" మూవీ విడుదల కానుంది. వీటితో పాటు మలయాళంలో  "రామ్" చిత్రంలో నటిస్తున్నారు. తమిళ్‌లోనూ "ది రోడ్" (The Road)మూవీలోనూ కనిపించనున్నారు. 


 










Also Read: Tollywood: బంద్ ఎత్తేస్తున్న నిర్మాతలు - సెప్టెంబర్ 1నుంచి సినిమా షూటింగ్స్!


Also Read: Meera Jasmine: అమ్మాయి బాగుంది-మీరా జాస్మిన్ లేటెస్ట్ ఫోటోస్