దొంగతనం కేసులో ప్రముఖ నటి రూపా దత్తాను కోల్‌కతా పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ కోల్‌కతా బుక్ ఫెయిర్‌లో ఈ దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇలా దొరికింది!
బుక్‌ఫెయిర్‌కి శనివారం వెళ్లిన నటి రూపా దత్తా.. డస్ట్ బిన్‌లో ఓ పర్సు విసిరేయడాన్ని పోలీస్ చూశారు. ఆ తర్వాత అనుమానం వచ్చి రూపాను ప్రశ్నించి, ఆమెకు సంబంధించిన వస్తువులను తనిఖీ చేశారు. అయితే ఆమె బ్యాగ్‌లో చాలా పర్సులు, రూ. 75 వేల డబ్బు దొరికింది.
అనంతరం ఆమెను స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఓ రోజు కస్టడీ విధించింది.
అప్పట్లో
డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తనను లైంగిక వేధించారని రూపా దత్తా అప్పట్లో ఆరోపణలు చేసింది. అయితే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని తర్వాత తేలింది. 2020లో ఫేస్‌బుక్ ద్వారా అనురాగ్ తనకు తప్పుడు సందేశాలు పంపారని రూపా ఆరోపించింది. అయితే ఆమె ఛాట్ చేసిన వ్యక్తి మొదటి పేరు అనురాగ్ అని ఆయన డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కాదని తర్వాత తేలింది.
రూపా దత్తా బెంగాలీ సినిమాలు, సీరియళ్లలో నటించింది. బాలీవుడ్ సీరియల్ 'జై మా వైష్ణోదేవి'లో ఆమె మాతా వైష్ణో దేవిగా నటించింది.
Also Read: Corona Cases India: భారత్‌లో 677 రోజుల కనిష్టానికి కరోనా పాజిటివ్ కేసులు, థర్డ్ వేవ్ తగ్గినట్టేనా!
Also Read: Uma Bharti Attack Video: మాజీ సీఎంకి పట్టరాని కోపం, బండ తీసుకొని షాపుపై దాడి - వీడియో వైరల్